iDreamPost
android-app
ios-app

మన్సూర్‌ అలీ అసభ్య కామెంట్లు.. రోజా ఫైర్‌!

  • Published Nov 20, 2023 | 11:49 AM Updated Updated Nov 20, 2023 | 11:49 AM

మన్సూర్‌ అలీ ఖాన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెను దుమారం రేపుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యల్లో రోజా, ఖుష్భూలను కూడా భాగం చేయటం సంచలనంగా మారింది..

మన్సూర్‌ అలీ ఖాన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెను దుమారం రేపుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యల్లో రోజా, ఖుష్భూలను కూడా భాగం చేయటం సంచలనంగా మారింది..

  • Published Nov 20, 2023 | 11:49 AMUpdated Nov 20, 2023 | 11:49 AM
మన్సూర్‌ అలీ అసభ్య కామెంట్లు.. రోజా ఫైర్‌!

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ త్రిషపై అసభ్య కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మన్సూర్‌ అలీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆయనపై ఆ‍గ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిష మొన్ననే ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. మన్సూర్‌ అలీఖాన్‌ ఆమెపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

దేవుడి దయ వల్ల అలాంటి నీచులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే పరిస్థితి తనకు రాలేదని అన్నారు. ఇకపై కూడా అతడితో కలిసి నటించనని తేల్చిచెప్పారు. మన్సూర్‌ లాంటి వాళ్లు మనుష జాతికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన త్రిష గురించి చెబుతూ మధ్యలో సీనియర్‌ నటీమణులు రోజా, ఖుష్భూల గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘ త్రిషతో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ, కుదర్లేదు. లియోలో త్రిషతో పాటు కలిసి నటించే అవకాశం వచ్చింది.

త్రిషతో కలిసి నటిస్తున్నానా? కచ్చితంగా బెడ్‌ రూము సీన్లు ఉంటాయి. రోజాను,ఖుష్భూను బెడ్‌పై పడేసినట్లు పడేద్దామని అనుకున్నాను. కానీ, ఆ ఛాన్సు దొరకలేద’’ని అంటూ అసభ్యంగా మాట్లాడారు. ఇక, ఈ వ్యాఖ్యలపై ఆర్‌కే రోజా తాజాగా ‍స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీటు పెట్టారు. ‘‘ ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడే మగాళ్లను శిక్షించడానికి చట్టపరమైన, పోలీసు చర్యలు ఉండాలి. నా గురించి తప్పుగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు..

త్రిష, ఖుష్భూ, నా గురించి తప్పుగా మాట్లాడిన మన్సూర్‌ అలీఖాన్‌ కావచ్చు. కఠినమైన చట్టపర చర్యలు తీసుకునే వరకు ఇలాంటి మగాళ్లు భయపడరు. మేము సినిమా, రాజకీయాల్లో రాణిస్తున్న మహిళలము.. అలాంటి మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇతర మహిళల గురించి ఏం చెబుతాం’’ అని పేర్కొన్నారు. మన్సూర్‌ అలీ వ్యాఖ్యలపై లియో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. మన్సూర్‌ పద్దతిని తప్పుబట్టారు. హీరోయిన్‌ మాళవిక మోహన్‌ కూడా మన్సూర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

‘‘ఇది చాలా దారుణంగా ఉంది. మన్సూర్‌కు మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. ఇది సిగ్గుచేటు. ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి’’ అని అన్నారు. కాగా, మన్సూర్‌ అలీ ఖాన్‌ హీరోయిన్లపై ఇలా అసభ్య వ్యాఖ్యలు చేయటం ఇదేం కొత్త కాదు..గతంలో తమన్నా గురించి తప్పుగా మాట్లాడారు. జైలర్‌ సినిమాలో అసభ్యంగా డ్యాన్స్‌ చేసిందన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెను దుమారం రేపాయి. మరి, మన్సూర్‌పై రోజా ఫైర్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom