iDreamPost
android-app
ios-app

మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలంటూ..

  • Published Oct 08, 2023 | 1:22 PM Updated Updated Oct 08, 2023 | 1:22 PM
  • Published Oct 08, 2023 | 1:22 PMUpdated Oct 08, 2023 | 1:22 PM
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలంటూ..

ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖా మంత్రి రోజాపై తెలుగుదేశం పార్టీ మాజీ మినిస్టర్ బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓ మహిళ నాయకురాలిపై అంత నీచంగా మాట్లాడుతావా అంటూ మండిపడుతున్నారు. బండారు చేసిన కామెంట్లపై మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి బండారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై రోజాకు దేశంలోని నటీనటులు, రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ మద్దతిస్తున్నారు. ఇప్పటికే నటి కుష్బూ, రాధిక, రమ్యక్రిష్ణ, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ వంటి యాక్టర్స్.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు.

తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు కోపం తెప్పిస్తున్నాయని అన్నది. ఓ మహిళ జీవితంలో పైకి ఎదుగుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతారా పబ్లిక్ గా అంటూ దుయ్యబట్టింది. మీరు కించపరిచేలా మాట్లాడితే ఏడుస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారా తగిన బుద్ది చెప్తారంటూ ఫైర్ అయ్యింది నటి మీనా. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని అన్నది. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది.

రోజాపై చేసిన వ్యాఖ్యలు అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడి క్యారెక్టర్ ను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను ఎల్లప్పుడు అండగా ఉంటాను అని మీనా మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet