iDreamPost
android-app
ios-app

YS Jagan: CM జగన్ బర్త్ డే.. నిరుపేదకు మంత్రి రోజా సర్ప్రైజ్ గిఫ్ట్.. బంగారు భవిష్యత్తునిస్తూ

  • Published Dec 21, 2023 | 10:17 AM Updated Updated Dec 21, 2023 | 10:17 AM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంత్రి రోజా ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంత్రి రోజా ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు.

  • Published Dec 21, 2023 | 10:17 AMUpdated Dec 21, 2023 | 10:17 AM
YS Jagan: CM జగన్ బర్త్ డే.. నిరుపేదకు మంత్రి రోజా సర్ప్రైజ్ గిఫ్ట్.. బంగారు భవిష్యత్తునిస్తూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. పార్టీ కార్యకర్తలు, నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఎంతో ఘనంగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా ముఖ్యమంత్రి జగన్ బర్త్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే మంత్రి రోజా.. ఈ ఏడాది తమ సీఎం బర్త్ డే సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తమ ప్రియతమ నేత జగన్న పుట్టిన రోజు సందర్భంగా.. ఓ నిరుపేద కుటుంబానికి బంగారు భవిష్యత్తున్ని జగనన్న బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు మంత్రి రోజా. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

మంత్రి రోజాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగనన్న కోసం ప్రాణాలు సైతం ఇస్తానని అనేక మార్లు చెప్పుకొచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న తోనే తన ప్రయాణం అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు మంత్రి రోజా. అంతేకాక సందర్భం వచ్చిన ప్రతి సారి జగన్ మీద అభిమానాన్ని మాటల్లో కాక.. చేతల్లో చూపుకుంటారు. గతంలో జగన్ బర్త్ డే సందర్భంగా అనాథ విద్యార్థిని దత్తత తీసుకుని డాక్టర్ చదివించగా.. మరోసారి తన నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు మంత్రి రోజా. ఇక ఈ ఏడాది జగన్ బర్త్ డే సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి బంగారు భవిషత్తునిచ్చారు మంత్రి రోజా.

ఈసారి జగన్ బర్త్ డే సందర్భంగా విజయవాడకు చెందిన వికాలాంగుడి కుటుంబాన్ని ఆదుకున్నారు రోజా. నగరంలోని బాంబే కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు వికలాంగుడు. అయినా సరే.. తనకు చేతనైన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. రోడ్డు మీద చెప్పులు అమ్ముతూ భార్య బిడ్డలను పోషించుకుంటుండేవాడు తప్ప.. చేయి చాచి ఎవరిని సాయం కోరేవాడు కాదు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. తమకున్నదాంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తోన్న వారి కుటుంబం మీద విధి పగబట్టింది. నాగరాజు భార్యకు ఆరోగ్యం పాడయ్యింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితం అయ్యింది.

ఇన్నాళ్లు తనకు తోడు నీడగా ఉండి.. చేతనైన చేసే భార్య మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారం మొత్తం నాగరాజు మీదనే పడింది. పైగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణ భారం కూడా అతడి మీదనే పడింది. ఇలాంటి సమయంలో కూడా ఎవరి సాయం తీసుకోలేదు నాగరాజు. ప్రభుత్వం నుంచి వచ్చే వికలాంగ పెన్షన్, తాను చేసే పని ద్వారా లభించే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక నాగరాజు దీన పరిస్థితి మంత్రి రోజా దృష్టికి వెళ్లింది. ఇక సమస్య అని తెలిస్తే చాలు.. వెంటనే స్పందించే మంత్రి రోజా.. నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు.

ఈ క్రమంలో సీఎం జగన్ బర్త్ డే రోజున.. క్రిస్మత్ తాగ గెటప్ లో నాగరాజు ఇంటికి వెళ్లి.. వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మంత్రి రోజా. నాగరాజు కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అలానే నాగరాజు పిల్లలకు బట్టలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి.. వారికి ధైర్యం చెప్పారు. ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని మర్చి పోవద్దని చెప్పారు. ఇక మంత్రి రోజా చేసిన సాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాగరాజు కుటుంబ సభ్యులు. ఆమె మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జగన్ కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.