iDreamPost
android-app
ios-app

బ్రాహ్మణిపై రోజా కౌంటర్స్! దేవాన్ష్‌కు చూపకండి అంటూ..!

బ్రాహ్మణిపై రోజా కౌంటర్స్! దేవాన్ష్‌కు చూపకండి అంటూ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎండకాలంలో వచ్చే వేడిని మించి హీట్ గా ఉన్నాయి. రాజకీయ వేడితో రాష్ట్రమంతా ఉక్కపోత పెడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆయన అరెస్టుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా అక్కడక్కడ టీడీపీ శ్రేణులు ర్యాలీలు చేస్తున్నారు. అలానే శనివారం రాజమండ్రిలో నారా భునేశ్వరి, నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన తప్పా, మేము ఒంటరి వాళ్లం కాదు..ప్రజలందరూ మా వెంట ఉన్నారంటూ వ్యాఖ్యనించారు. అయితే బ్రాహ్మణికి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.

ఆదివారం మీడియాతో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దించారని.. తీరా చూస్తే.. ఈ అస్త్రం తుస్సుమందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  దేవాన్స్ కు పొరపాటును కూడా సీఐడీ రిమాండ్ రిపోర్టును చూపించొద్దంటూ సెటైర్లు వేశారు.  మా తాతా ఇంతటి అవినీతి పరుడా అని దేవాన్ష్ అనుకుంటాడని రోజా వ్యాఖ్యనించారు. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని.. ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదని నిన్ననే అర్ధమైందని రోజా చురకలంటించారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. పవన్ నమ్మి..జనసేన జెండా మోసిన అభిమానులను ఆయన మోసం చేశారని దుయ్యబట్టారు.

ఇక జగన్ స్థాయి ఎంతా అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఎంపీగా 5 లక్షలకుపైగా మోజార్టీ సాధించారని గుర్తు చేశారు. అది జగన్ స్థాయి అని, జగన్ ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓడిపోయాడని, అది పవన్ స్థాయని రోజా దుయ్యబట్టారు. పవన్.. ఇతర పార్టీ జెండాలు మోసే కూలీగా మారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. పవన్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని రోజా హితవు పలికారు. యుద్ధానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే వుంటారని రోజా తెలిపారు. మరి.. మంత్రి రోజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.