రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India, RBI) కి క్లెయిమ్ చేయని డిపాజిట్లు రానురాను తలనొప్పిగా మారుతున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను 39 వేల 264 కోట్ల రూపాయలున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అమాంతం 48 వేల 262 కోట్లకు ఎగబాకాయి. వీటిలో అధిక శాతం తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రధానంగా […]
కరెన్సీ నోట్లు ఆర్బీఐ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవడానికి ప్రతి మూడునెలలకు ఒకసారి నోట్ సార్టింగ్ మిషన్లను టెస్ట్ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకులను కోరింది. ఆర్బీఐ నిర్దేశించిన 11 ప్రమాణాలను బట్టే, నోట్లు నిజమైనా? కావా అనేది నిర్ధారిస్తారు. అందుకే నోట్లను లెక్కబెట్టే మిషన్లకు బదులు, వాడటానికివీలైన కరెన్సీ నోట్లను కనిపెట్టే నోట్ ఫిట్ సార్టింగ్ మిషన్లను ఉపయోగించాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. దెబ్బతిన్న నోట్లను రిసైకిల్ చేయలేరు. ఎందుకంటే […]
వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ఇప్పుడు క్రెడిట్ కార్డుల పరిమితులకు సంబంధించిన నిబంధనలు మరో 3 నెలలు పొడిగించింది. దీని ద్వారా కార్డును యాక్టివేట్ చేసేందుకు ఓటీపీని తప్పనిసరి చేసే నిబంధనకు మరింత గడువు లభించింది. బ్యాంకులు క్రెడిట్ కార్డును జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల లోపు ఆ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి. అలా కాని పక్షంలో కార్డును యాక్టివేట్ చేసేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ నిబంధనను తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నిబంధనల్ని […]
2016, నవంబరు నెలలో ప్రధాని మోడీ టీవీల ముందుకు వచ్చి ‘దేశ్ కీ వాసియోం..’ అని మొదలు పెట్టి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించేసారు. దీంతో ఆ రాత్రికి పెద్దగా జనం ఎవ్వరూ దీనిపై దృష్టి పెట్టలేదు గానీ.. తెల్లారేసరికి మాత్రం కలకలం మొదలైంది. చిన్నా పెద్దా, పిల్లా పీచును వెంటబెట్టుకుని తమ దగ్గరున్న నోట్లతో బ్యాంకుల వద్దకు పరుగులు తీసారు. అక్కడ అప్పటికే భారీ క్యూ ఉండడంతో ఖంగుతున్నారు. అయితే నానా తంటాలు పడి తమ […]
ఆన్లైన్ లోన్ యాప్స్, మనీ లెండింగ్ యాప్స్.. పేరేదైనా గానీ వ్యాపారమే ప్రథమ లక్ష్యం. కోవిడ్ కారణంగా కష్టమర్లు రాక అనేకానేక వ్యాపారాల నిర్వాహకులు మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. కానీ అదే కోవిడ్ ఈ యాప్‌లకు కావాల్సిన కష్టమర్లను తయారు చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన బాధితులు ఈ లోన్ యాప్స్‌ను ఆశ్రయించి అప్పులు తీసుకుంటున్నట్లుగా పలు నివేదికల ద్వారా వెల్లడవుతోంది. లాక్డౌన్ కాలంలో దాదాపుగా పది లక్షలకు పైగా కష్టమర్లు ఈ యాప్‌లకు యాడ్ […]
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఎంతగా విస్తృతం అవుతున్నాయో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. వ్యక్తులు వ్యక్తుల మధ్య జరిగే ఈ మోసాలు చాలా వరకు అవగాహన లేకపోవడం, అత్యాసకుపోవడం తదితర కారణాల ద్వారానే ఏర్పడుతుంటాయి. కానీ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో కూడా ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఆధ్వర్యంలో పలు సేఫ్టీ మెజర్మెంట్స్ను సిద్ధం చేస్తోంది. ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ మోసపూరిత కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నం చేపడుతోంది. తాజాగా పాజిటివ్ […]
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు పొందిన వారికి చక్రవడ్డీ మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోవిడ్ కారణంగా ఏర్పడ్డ ఆర్ధిక ప్రతిష్టంభన నుంచి కాస్తంత ఉపసమనం కలిగించే విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 5,600 కోట్లను వెచ్చిస్తోంది. రుణ మారటోరియం వినియోగించుకున్న వారికే కాకుండా సక్రమంగా వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఉపసమన ప్రయోజనం అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో రుణచెల్లింపు సంప్రదాయాన్ని సక్రమంగా కొనసాగించే విధంగా ప్రోత్సాహాన్ని అందించేటట్టుగానే […]
రుణాలపై మారటోరియం సమయంలో చక్రవడ్డీ మాఫీ తప్పితే ఇంకేమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు సుప్రీంకోర్టులో తమతమ అఫిడవిట్లలో తేల్చేసాయి. రెండుకోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్టు ఇది వరకే సమర్పించిన అఫిడవిట్‌కే పరిమితమవుతున్నట్లు చెప్పాయి. ఇంతకు మించి చేస్తే రుణ గ్రహీతలపై భారం పడడంతోపాటు, రుణ చెల్లింపు విధానం దెబ్బతింటుందని చెప్పుకొచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 1 నుంచి మే 31 కాలానికి రుణాలు, ఈయంఐలు చెలింపు విషయంలో మారటోరియం విధించింది. అయితే ఆ […]
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ప్రయివేటు సంస్థలు కూడా వినియోగించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసి)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, గిరిరాజ్ సింగ్, జితేంద్ర సింగ్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. అంతరిక్ష […]
నరేంద్రమోడి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి పారిశ్రామిక దిగ్గజాలు తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకులు రద్దు చేసేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల రానిబాకీల పద్దుల్లో రద్దు చేయగా తాజగా ఆర్బిఐ కూడా రూ. 68,807 కోట్ల అప్పులను రద్దు చేయటం సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్బిఐ రద్దు చేసిన బకాయిలన్నీ ఇప్పటికే కేసులు ఎదుర్కొటున్న పారిశ్రామికవేత్తలవే కావటం. బ్యాంకుల నుండి వందల నుండి వేల కోట్ల […]