iDreamPost
android-app
ios-app

లోన్ EMI కట్టలేకపోతున్నారా? మీకో శుభవార్త!

  • Published Nov 07, 2024 | 4:12 PM Updated Updated Nov 07, 2024 | 4:12 PM

Loan: చాలా మంది కూడా లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ తరువాత EMI కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Loan: చాలా మంది కూడా లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ తరువాత EMI కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

లోన్ EMI కట్టలేకపోతున్నారా? మీకో శుభవార్త!

మనం సాధారణంగా బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటాము. కొన్నాళ్ళు EMI కట్టిన తరువాత మనకు చాలా కష్టం అవుతుంది. అప్పు చెల్లించలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు ఊహించని ఆర్థిక ఇబ్బందుల కారణంగా EMI చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ అప్పుల కారణంగా చాలా మంది అనేక వేధింపులకు గురవుతున్నారు. చాలా మంది వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నారు కూడా. అలా అప్పులు తీర్చలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

RBI ప్రజలకు ఇలాంటి పరిస్థితుల విషయంలో సహాయం చేయడానికి మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. EMI సరిగ్గా కట్టకపోతే పోలీస్ కేస్ పెట్టి జైల్లో వేయిస్తామని లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తూ ఉంటారు. అయితే EMI కట్టకపోవడం అనేది అసలు క్రిమినల్ నేరం కాదని తేల్చి చెప్పేసింది RBI. మీరు లోన్‌ను డిఫాల్ట్ చేసినందుకు ఎటువంటి జైలు శిక్షను ఎదుర్కోరు. లోన్ చెల్లింపులకు లింక్ చేసిన బౌన్స్ చెక్ చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు, కానీ కేవలం EMIని కట్టకపోవడం మాత్రం మిమ్మల్ని జైలు పాలు చేయదు.అయితే EMI చెల్లింపులు చేయకపోవడం వల్ల క్రిమినల్ కేసులు ఉండవు. కానీ ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఫ్యూచర్ లో మీకు ఏ బ్యాంక్ నుంచి లోన్లు రావు. ఒకవేళ లోన్లు వచ్చినా కూడా మీరు ఎక్కువ వడ్డీని కట్టాల్సి ఉంటుంది. మీరు EMI కట్టలేక పోతే బ్యాంకులు మీ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. వాటిని వేలం వేయవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు బ్యాంక్ ని సంప్రదించక పోతే జరుగుతుంది.

మీరు లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు కచ్చితంగా బ్యాంక్ కి వెళ్ళాలి. మీ సమస్యని వారికి చెప్పాలి. మీ లోన్ తీర్చడానికి పరిష్కారం అడగాలి. అప్పుడు బ్యాంక్ మీకు పరిష్కారం చూపిస్తుంది. మీ టెన్యూర్ పెంచడమో లేక వడ్డీని తగ్గించడమో లేదా మీకు అప్పు తీర్చుకోడానికి కొంత టైమ్ ఇవ్వడమో చేస్తుంది. దాంతో మీకు లోన్ తీర్చుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి EMI కట్టలేక పోవడం అనేది క్రిమినల్ నేరం కాదు. ఈ రూల్ బ్యాంకులకే కాదు ఇతర ఫైనాన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. మీకు EMI కట్టడం ఇబ్బంది అయితే RBI రూల్స్ ప్రకారం మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకోవడం మంచిది. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş