iDreamPost
android-app
ios-app

షాపుల్లో రూ.10 కాయిన్ తీసుకోవట్లేదా? RBI సంచలన నిర్ణయం! ఇక వారు జైలుకే!

  • Published Nov 20, 2024 | 3:18 PM Updated Updated Nov 20, 2024 | 3:18 PM

RBI: ప్రస్తుతం చాలా చోట్ల కూడా 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదు. అలాంటి వారికి ఇక తిప్పలు తప్పవు.

RBI: ప్రస్తుతం చాలా చోట్ల కూడా 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదు. అలాంటి వారికి ఇక తిప్పలు తప్పవు.

షాపుల్లో రూ.10 కాయిన్ తీసుకోవట్లేదా? RBI సంచలన నిర్ణయం! ఇక వారు జైలుకే!

ప్రస్తుతం చాలా కిరాణా షాపుల్లో కూడా 10 రూపాయల కాయిన్స్ ఇస్తుంటే తీసుకోవడం లేదు. అవి చెల్లుతాయిరా బాబు రిజర్వ్ బ్యాంకే తీసుకోమని చెబుతుంది అని ఎంత చెప్పినా కూడా.. వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, అసలు చెల్లవంటూ తీసుకోవడం లేదు. ఈ నాణేలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులు పదేపదే చెబుతున్నా కూడా చాలా మంది వీటిని తీసుకోవడానికి ససేమీరా అంటున్నారు. ఈ విషయంపై RBI చాలా సీరియస్ అయ్యింది. ఇవి చెల్లుతాయి అని మంచిగా చెప్పినా కూడా ఎవరు వినట్లేదు. అందుకు మరోసారీ ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. ఈ కాయిన్స్ తీసుకోకపోతే చట్టరీత్యా నేరమని చాలా మందికి కూడా తెలీదు. అంతేగాక వీటిని తీసుకొని వ్యక్తులపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆ విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇక ఈ కాయిన్స్ తీసుకొని వారిపై ఎలాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు? వీరికి ఎన్ని సంవతారాలు జైలు శిక్ష పడుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎవరైనా 10 రూపాయల కాయిన్లను తీసుకోవడానికి నిరాకరిస్తే వారిపై FIR రిజిస్టర్ చేయవచ్చు. వారిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. భారతదేశంలో రూ.10 కాయిన్ విడుదలై 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలా మంది చట్టబద్ధమైన కరెన్సీగా వీటిని వాడుకునేందుకు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరులో ఇప్పటికే కొన్ని షాపులు, ప్లేస్ ల దగ్గర రూ.10 కాయిన్ తీసుకోని వారు మూడు సంవత్సరాల జైలుకు గురవుతారు అని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో చాలా బ్యాంకులు కూడా ప్రజల్లో, వ్యాపారాల్లో రూ.10 కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో కొన్ని హోటల్స్, క్యాంటీన్లు రూ.10 కాయిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. అయినా కూడా చాలా మంది వీటిని తీసుకోవడం లేదు.

ప్రభుత్వం ఆమోదించిన ఈ కాయిన్ లను తీసుకోకపోవడం కచ్చితంగా నేరం అవుతుందని RBI స్పష్టం చేసింది. అలాగే అవి చెల్లవంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేసినా కూడా మూడేళ్ళ జైలు శిక్ష ఖాయమని హెచ్చరిస్తోంది. 10 రూపాయల నాణేలు చెలామణీలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. నిరాకరించిన వారిపై ఐపీసీ సెక్షన్, 489A, 489E, 124 కింద ఫిర్యాదు చేయవచ్చు. ఇక విచారణలో 10 రూపాయల కాయిన్స్ తీసుకోవట్లేదనే విషయం రుజువైతే మూడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుందని RBI స్పష్టం చేసింది. మీరు ఉండే ఏరియాలో ఇలా ఎవరైనా 10 రూపాయల కాయిన్స్ తీసుకోకోపోతే.. కచ్చితంగా ఈ విషయాలను చెప్పండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.