P Venkatesh
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ రూల్స్ ను మార్చింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ రూల్స్ ను మార్చింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందాలన్నా, డబ్బు దాచుకోవాలన్నా.. లోన్స్ కోసం అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తి వివిద అవసరాల రీత్యా ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ లను ఓపెన్ చేస్తున్నారు. అయితే ఖాతాదారులు మోసాలబారిన పడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఈక్రమంలో ఆర్బీఐ నో యువర్ కస్టమర్ నియమాలను మార్చింది. కేవైసీ రూల్స్ కు సంబంధించి మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. అకౌంట్ హోల్డర్స్ ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే. మీ ఖాతా సక్రమంగా పనిచేయాలంటే కేవైసీ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాల్సిందే.
ఇకపై ఇలా చేస్తేనే మీ ఖాతా సేఫ్ గా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అవకతవకలు జరగకుండా, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఆర్బీఐ కేవైసీని తప్పనిసరి చేసింది. ఏదైనా సమాచారం అవసరమైనప్పుడు పూర్తిగా కేవైసీ చేయించుకోవడం మంచిది. లేకపోతే ఖాతా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కు కేవైసీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయి. కాబట్టి కేవైసీ కోసం బ్యాంకుకు వెళ్లి పాన్, ఆధార్ వివరాలను సమర్పించి అప్ డేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్ గా ఉండాలంటే కేవైసీ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. కేవైసీ ద్వారా బ్యాంకులు తమ కస్టమర్ల ఐడెంటిటీని వెరిఫై చేస్తాయి.
మోసాలకు చెక్ పెట్టడానికి కేవైసీ సాయపడుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కేవైసీ నియమాలను మార్చింది. నవంబర్ 6న కేవైసీకి కొత్త, రిస్క్ బేస్డ్ అప్రోచ్‌ను బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెలలోనే మారిన రూల్స్ అమల్లోకి వస్తాయి. ఖాతాలో సమస్య ఉంటే వెంటనే కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సూచిస్తుంది. ఆర్‌బీఐ కేవైసీ మార్గదర్శకాల ప్రకారం.. హై-రిస్క్ కస్టమర్లు ప్రతి 2 సంవత్సరాలకు కేవైసీని తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. మీడియం-రిస్క్ కస్టమర్లు ప్రతి 8 సంవత్సరాలకు కేవైసీని తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. లో-రిస్క్ కస్టమర్లు ప్రతి 10 సంవత్సరాలకు కేవైసీ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. అకౌంట్‌లో ఏవైనా వివరాలు లేకుంటే లేదా తప్పుగా ఉంటే కేవైసీ అప్‌డేట్ చేయాలి.
ఏదైనా డాక్యుమెంట్ (గుర్తింపు కార్డులు) గడువు ముగిస్తే కేవైసీ ద్వారా అప్‌డేట్ చేయాలి. బ్యాంకుకు మరింత సమాచారం అవసరమైతే కూడా కేవైపీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు బ్యాంకు వద్ద ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంక్ వెబ్ సైట్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు. అన్ని కేవైసీలు కూడా సెంట్రల్ కేవైసీ రికార్డ్ రిజిస్ట్రీలో అప్‌డేట్ చేయవలసిందిగా ఆర్బీఐ కోరింది. ఈ సెంట్రల్ ప్లాట్‌ఫారమ్ కస్టమర్ల వివరాలను మళ్లీ సమర్పించమని పదే పదే అడగకుండానే అప్‌డేటెడ్ ఇన్‌ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి బ్యాంకులను అనుమతిస్తుంది.