Vinay Kola
HDFC: HDFC బ్యాంక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
HDFC: HDFC బ్యాంక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
Vinay Kola
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే లోన్ తీసుకునే వారికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. మనకు తక్కువ వడ్డీకే లోన్లు వస్తాయి. అయితే ఇంతలోనే బ్యాంకులు కస్టమర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తున్నాయి. RBI రెపో రేట్లని తగ్గించే లోపే లోన్ వడ్డీ రేట్లను కొన్ని టెన్యూర్లపై పెంచుకోవడానికి రెఢీ అవుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోన్ పై వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని షార్ట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేట్లు ఆల్రెడీ పెరిగాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేట్లు ఈ బ్యాంకులో 9.15 శాతం నుంచి 9.50 శాతంగా ఉన్నాయి. నవంబర్ 7 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
కన్జూమర్ లోన్లు ఏడాది టెన్యూర్ విషయానికి వస్తే.. ఎంసీఎల్ఆర్ ప్రకారం ప్రస్తుతం 9.45 శాతంగా ఉంది. ఇక పర్సనల్ లోన్, హోం లోన్, వెహికిల్ లోన్ ఇలా అన్నిటికి కూడా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ప్రకారంగానే లోన్లు తీసుకుంటుంటాయి. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ కూడా పెరుగుతుంది. అలాగే బ్యాంకుల్లో ఇతర గోల్డ్ లోన్, హోం లోన్ కంటే పర్సనల్ లోన్లపైనే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. దీనిని బట్టీ ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఏకంగా 10.85 శాతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మాక్సిమం 21 శాతం వరకు ఉన్నాయి. రూ. 50 వేల నుంచి మాక్సిమం రూ. 40 లక్షల వరకు లోన్ వస్తుంది. అర్హతల్ని బట్టి.. ఈ లోన్లు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఇక ఇందులో సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా టెన్యూర్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ వడ్డీ రేటు అనేది 10.85 శాతంగా ఉన్నా కానీ కొంత మందికి తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వనుందట HDFC. అది కూడా కేవలం అతికొద్ది మందికే తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి.
బ్యాంకుతో ఎక్కువ కాలం సంబంధం కలిగి ఉన్నవారు లేదా సీనియర్ సిటిజెన్లు లేదా క్రెడిట్ స్కోరు అత్యద్భుతంగా ఉన్నవారికి ఇలా తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఇక క్రెడిట్ స్కోరు 750 దాటినా కూడా మినిమం 13 శాతం వడ్డీ రేటుకు ఈ ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అప్పుడు రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ రూ. 11,377 కట్టాలి. అదే 10 లక్షల లోన్ పై ఐదేళ్లకు 13 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 22,753 ఈఎంఐ కట్టాలి. లోన్లపై ఏ బ్యాంకులోనైనా ప్రాసెసింగ్ ఫీజు కచ్చితంగా పడుతుంది. ఇది ఒకేసారి కట్టాలి. పైగా జీఎస్టీ కూడా అదనంగా కట్టాలి. ఇదీ సంగతి. కాబట్టి లోన్ తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.