iDreamPost
android-app
ios-app

మరో Bankపై RBI కొరడా.. అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!

  • Published Aug 17, 2024 | 11:37 AM Updated Updated Aug 17, 2024 | 11:37 AM

Bank of Maharashtra: రూల్స్ అతిక్రమించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా మరో బ్యాంకుపై చర్యలు తీసుకున్నది. ఇంతకీ కారణం ఏంటంటే?

Bank of Maharashtra: రూల్స్ అతిక్రమించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా మరో బ్యాంకుపై చర్యలు తీసుకున్నది. ఇంతకీ కారణం ఏంటంటే?

మరో Bankపై RBI కొరడా.. అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు అతిక్రమించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్, కోపరేటివ్ బ్యాంకులపై చర్యలు తీసుకుంటున్నది. రూల్స్ పాటించని బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తూ కొన్ని సందర్భాల్లో లైసెన్స్ లను సైతం రద్దు చేస్తున్నది. ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ పలు బ్యాంకుల పనితీరులో మార్పు రావడం లేదు. ఇప్పుడు మరో బ్యాంక్ పై కొరడా ఝుళిపించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు భారీగా జరిమానా విధించింది. ఏకంగా రూ. 1.27 కోట్ల ఫైన్ విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. బీఓఎంపై ఫైన్ విధించడానికి గల కారణం ఏంటంటే?

కేవైసీ నిబంధనలు, తగినంత మూలధనం లేకపోవడం వంటి పలు కారణాలతో బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేవైసీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందున రూ. 1.27 కోట్ల జరిమానా విధించింది. లోన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెలివరీ ఆఫ్‌ బ్యాంక్‌ క్రెడిట్, సైబర్‌ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ ఇన్‌ బ్యాంక్స్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను కూడా బీఓఎం ఉల్లంఘించిందని ఆగస్టు 8న విడుదల చేసిన ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. బీవోఎంతో పాటు మరో రెండు ఆర్థిక సంస్థలకు జరిమానా విధించింది.

కేవైసీ, ఎన్‌బీఎఫ్‌సీకి సంబంధించి పలు రకాల నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్‌కు రూ.4.90 లక్షలు, పూనావాలా ఫిన్‌కార్ప్‌ సంస్థకు రూ.10 లక్షల జరిమానాను ఆర్‌బీఐ విధించింది. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. బ్యాంకు కార్యాకలాపాలు సక్రమంగా నిర్వహించేలా ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే నియమాలను అతిక్రమించే బ్యాంకులకు భారీగా జరిమానాలను విధిస్తూ.. లైసెన్స్ లను రద్దు చేస్తున్నది.