iDreamPost
android-app
ios-app

Money: పెళ్లి బరాత్ లో నోట్లు విసురుతున్నారా? ఇక జైలుకే!

  • Published Nov 22, 2024 | 5:11 PM Updated Updated Nov 22, 2024 | 5:11 PM

Money: చాలా మంది కూడా పెళ్ళిళ్ళలో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు.

Money: చాలా మంది కూడా పెళ్ళిళ్ళలో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు.

Money: పెళ్లి బరాత్ లో నోట్లు విసురుతున్నారా? ఇక జైలుకే!

భారతదేశంలో పెళ్ళిళ్ళు అంటే చాలు చచ్చిపోతారు జనాలు. పెళ్లి చేసుకోవడానికి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతారు. ఆ ఖర్చు సరిపోక అప్పులు కూడా చేసే మహానుభావులు బోలెడు మంది ఉన్నారు. అదేంటో విడిగా ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి బాబోయ్ అంటూ ఏడ్చే జనాలు పెళ్లికి మాత్రం ఆ డబ్బు నోట్లని టిష్యూ పేపర్లలాగా వేస్ట్ చేస్తారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళలో, లేదా పెళ్లి ఊరేగింపుల్లో డబ్బు ఖర్చుపెట్టే హాబీ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ దేశంలో లేని ఈ దరిద్రమైన అలవాటు మన దేశంలోనే ఉంది. ఈ అలవాటు కాస్త భావి తరాలకు ఆనవాయితీగా మారుతుంది. పెళ్లి ఇలాగే చేసుకోవలేమో అనేంతలా ఈ సంస్కృతి పాకిపోతుంది. పెళ్ళి వేడుక అర్ధాన్నే మార్చేస్తుంది. అయితే మనం పెళ్లిళ్లకు విచ్చల విడిగా వేస్ట్ చేసే డబ్బుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏం చెబుతుంది? అసలు మన చట్టాలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డబ్బు వృధాకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A ప్రకారం, కరెన్సీ నోట్లను పేమెంట్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ చట్టం ప్రకారం, స్టాప్లింగ్, అతికించడం, నోట్ల దండలు తయారు చేయడం వంటి వాటికి పర్మిషన్ లేదు. పెళ్ళిళ్ళలో నోట్లను వృధా చేయడం, వరుడు లేదా వధువుకి నోట్ల దండను వేయడం.. ఇలాంటి పనులకు ప్రత్యేకించి ఆర్బిఐ నుంచి శిక్ష లేదా జరిమానా అనే రూల్ లేదు. కానీ డబ్బులు వేస్ట్ చేసినందుకు ఆర్బీఐ డైరెక్ట్ గా శిక్షించనప్పటికీ, భారతీయ కరెన్సీ చట్టం ప్రకారం కచ్చితంగా శిక్ష పడవచ్చు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నోట్లను ధ్వంసం చేసినా లేదా వృధా చేసినా వారికి కచ్చితంగా జరిమానా విధించవచ్చు. అలాగే రూల్స్ ప్రకారం, వారికి 6 నెలల నుండి 3 సంవత్సరాల దాకా శిక్ష పడుతుంది.

ఢిల్లీ హైకోర్టు ప్రకారం.. ఎవరైనా రోడ్డుపై కరెన్సీ నోట్లను దగ్ధం చేసినా, నోట్లను విసిరేస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తే అది నేరం. ఎందుకంటే డబ్బును దోచుకునే వారు రోడ్లపై కొంత డబ్బులు విసిరేసి వాహనాలను అడ్డుకుంటూ బీభత్సం సృష్టిస్తుంటారు. అలాంటి పరిస్థితిలో వారిపై కేసు నమోదు చేయవచ్చు.వారిపై అభియోగాలు రుజువైతే శిక్ష లేదా జరిమానా పడొచ్చు. భారతీయ కరెన్సీ చట్టం ప్రకారం నోట్లను వృధా చేయడం, ఇలా దండలుగా చేసి వరుడి మెడలో వేయడం, రోడ్లపై విసిరేయడం లాంటి పనులు చేస్తే నేరమే. ఈ రూల్స్ ఆర్బీఐలో లేనప్పటికీ భారతీయ కరెన్సీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అందువల్ల మీరు కేసులు, జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పనులు చేయడం మానుకోవడం మంచిది. డబ్బులు ఊరికే రావు. మనం చాలా కష్టపడాలి. కాబట్టి డబ్బుని ఖర్చు పెట్టె విషయంలో బాధ్యతగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.