iDreamPost
android-app
ios-app

విద్యార్థుల కోసం RBI క్విజ్.. ఏకంగా 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. మీరూ ట్రై చేయండి

RBI90Quiz: విద్యార్థులకు గుడ్ న్యూస్. మీకు 10 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

RBI90Quiz: విద్యార్థులకు గుడ్ న్యూస్. మీకు 10 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

విద్యార్థుల కోసం RBI క్విజ్.. ఏకంగా 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. మీరూ ట్రై చేయండి

మీరు వివిధ అంశాల్లో మంచి నాలెడ్జ్ కలిగి ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. క్విజ్ పోటీలో పాల్గొని ఏకంగా రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం వచ్చింది. ఏంటీ.. క్విజ్ పోటీలో పాల్గొంటే పది లక్షలా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి బాబూ. బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కళాశాల విద్యార్థులకు ఆర్బీఐ 90 క్విజ్ పేరుతో ఈ పోటీలు ప్రారంభించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ RBI90Quiz కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆగస్టు 20న ఆవిష్కరించారు.

RBI90Quiz కోసం రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. క్విజ్‌లో పాల్గొనడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్విజ్‌లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, లిటరేచర్, స్పోర్ట్స్, ఎకానమీ, ఫైనాన్స్ వంటి జనరల్ నాలెడ్జ్ విభాగాలతో సహా వివిధ అంశాలపై బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. అదనంగా, ప్రత్యేకంగా ఆర్బీఐకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులలో ఆర్బీఐ, ఆర్థిక వ్యవస్తలపై అవగాహన పెంచేందుకు ఈ క్విజ్ ను నిర్వహిస్తున్నది. ఇక ఈ క్విజ్ పోటీలు నాలుగు దశల్లో జరుగనున్నాయి.

ఫస్ట్ ఆన్ లైన్ లో ప్రారంభమై ఆ తర్వాత స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో పోటీలు జరుగుతాయి. ఈ క్విజ్ సెప్టెంబర్ లో జరుగనున్నది. ఈ క్విజ్ లో పాల్గొనే వారికి స్టేట్ లెవల్ లో ఫస్ట్ ప్రైజ్ రూ. 2 లక్షలు, ద్వితీయ ప్రైజ్ రూ. 1.5 లక్షలు, తృతీయ ప్రైజ్ రూ. 1 లక్ష అందించనున్నారు. ఇక జోనల్ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 4 లక్షలు, మూడో ప్రైజ్ 3 లక్షల చొప్పున బహుమతులు అందించనున్నారు. ఇక జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్ రౌండ్ లో విజేతలకు ఫస్ట్ ప్రైజ్ రూ. 10 లక్షలు, ద్వితీయ ప్రైజ్ రూ. 8 లక్షలు, తృతీయ ప్రైజ్ రూ. 6 లక్షలు అందించనున్నారు.