iDreamPost
android-app
ios-app

RBI ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. ఎంపికైతే నెలకు రూ. 20 వేలు మీవే.. ఇలా అప్లై చేసుకోండి

RBI Summer Internship-2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం 2024ను ప్రకటించింది. ఎంపికైతే నెలకు 20 వేలు పొందే ఛాన్స్.

RBI Summer Internship-2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం 2024ను ప్రకటించింది. ఎంపికైతే నెలకు 20 వేలు పొందే ఛాన్స్.

RBI ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. ఎంపికైతే నెలకు రూ. 20 వేలు మీవే.. ఇలా అప్లై చేసుకోండి

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వారి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి స్కిల్స్ పెంపొదిస్తున్నది. ఈ క్రమంలో పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులకు టాప్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాదు పీఎం ఇంటర్న్ షిప్ కు ఎంపికైతే ఏడాదికి 60 వేలు సాయం అందిస్తారు. ఇప్పుడు ఇదే రీతిలో బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువతకు గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం 2024ను ప్రకటించింది. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంకు ఎంపికైతే నెలకు రూ. 20 వేలు ఉచితంగా పొందొచ్చు. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్బీఐ అందించే ఈ సమ్మర్ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసిస్తున్న వారు అర్హులు. అలాగే భారతదేశంలోని ప్రసిద్ధ సంస్థల నుంచి న్యాయశాస్త్రంలో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీలలో చేరిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకి అర్హులు. వచ్చే ఏడాది ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు మూడు నెలల పాటు ఆర్బీఐ ఇంటర్న్ షిప్ ప్రోగామ్ పై శిక్షణ ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 స్టైఫండ్ ఇస్తారు. ఆర్బీఐ ప్రతి సంవత్సరం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం 125 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి/ఫిబ్రవరిలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా రాష్ట్రాల్లోని ఆర్బీఐ కార్యాలయాలలో ఇంటర్వ్యూ చేస్తారు.

ఎంపికైన విద్యార్థుల పేర్లు ఫిబ్రవరి/మార్చిలో ప్రకటిస్తారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం opportunities.rbi.org.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ opportunities.rbi.org.in లోకి వెళ్లి హోమ్ పేజీలోని ‘సమ్మర్ ప్లేస్మెంట్స్’ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2024 పేజీలోని ఆన్ లైన్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి సరైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుంటే బెటర్. మరి ఆర్బీఐ అందించే ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.