iDreamPost
android-app
ios-app

Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్లపై ప్రీమెచ్యూర్ విత్ డ్రా తేదీలను ప్రకటించిన ఆర్బీఐ

  • Published Aug 24, 2024 | 3:38 PM Updated Updated Aug 24, 2024 | 3:38 PM

Gold Bonds: ఆన్ లైన్ లో డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేవారికి కేంద్రం మంచి రిటర్న్స్ ని అందిస్తుంది. కేంద్రం తరపున ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ని జారీ చేస్తుంటుంది. కాగా ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టే కస్టమర్స్ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

Gold Bonds: ఆన్ లైన్ లో డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేవారికి కేంద్రం మంచి రిటర్న్స్ ని అందిస్తుంది. కేంద్రం తరపున ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ని జారీ చేస్తుంటుంది. కాగా ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టే కస్టమర్స్ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్లపై ప్రీమెచ్యూర్ విత్ డ్రా తేదీలను ప్రకటించిన ఆర్బీఐ

భౌతిక బంగారం కొనుగోలు చేస్తే తరుగు, మజూరి కింద కొంత కోల్పోవడం, బంగారాన్ని భద్రపరచడానికి లాకర్ల ఖర్చు ఇలా కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. అదే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసినట్లయితే కనుక దాన్ని కాపాడుకోవాలన్న టెన్షన్ అవసరం లేదు. తరుగు, మజూరి వంటి ఇబ్బందులు ఉండవు. మీరు బంగారాన్ని అమ్మేయాలి అనుకున్నా లేదా విత్ డ్రా చేయాలనుకున్నా ఆ సమయానికి బంగారం ధర ఎంత ఉంటే అంతే రేటు చేతికొస్తుంది. ధరించడానికి ఉండదు కానీ పెట్టుబడి పెట్టి కొన్నేళ్ల తర్వాత మంచిగా లాభం పొందాలనుకునేవారికి ఈ డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే గోల్డ్ బాండ్స్ ని అందిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ అందిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకంలో ఇన్వెస్ట్ చేసేవారికి నిజంగా ఇదొక గొప్ప అవకాశం.

ఈ పథకంలో భాగంగా బంగారం మీద ఆన్ లైన్ లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ గోల్డ్ కి నిర్దిష్ట వడ్డీ రేటు ఉంటుంది. బంగారం ధర పెరిగిన ప్రతిసారీ దాని మీద మంచి లాభాలు వస్తాయి. గోల్డ్ బాండ్స్ స్కీం కాలపరిమితి 8 ఏళ్ళు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. అందుకోసం రిక్వస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో సామాన్యులు, ట్రస్టులు, యూనివర్సిటీలే ఇలా ఎవరైనా చేరి పెట్టుబడి పెట్టవచ్చు. సామాన్య ప్రజలకు కనీసం ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల వరకూ కొనేందుకు అవకాశం ఉంది. ట్రస్టులు వంటి వాటికి గరిష్టంగా 20 కిలోల వరకూ గోల్డ్ బాండ్స్ ని కొనుగోలు చేయవచ్చు. పైగా ఆన్ లైన్ లో గోల్డ్ కొనడం వల్ల గ్రాము మీద 50 రూపాయల తగ్గింపు లభిస్తుంది.

Gold bonds

ఇండియన్ బులియన్ జెవెల్లెర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) నిర్ణయించిన ధరల ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ గోల్డ్ బాండ్స్ రేటుని నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఈ క్రమంలో గోల్డ్ బాండ్లకు సంబంధించి జారీ, రిడంప్షన్ తేదీలను ప్రకటిస్తుంటుంది. తాజాగా ఈ తేదీలను ప్రకటించింది ఆర్బీఐ. కొన్ని రోజుల క్రితం బంగారం, వెండి వంటి వాటిపై కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అయితే గోల్డ్ బాండ్ రిటర్న్స్ కూడా తగ్గుతాయని.. కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఈ స్కీం కింద ట్రాంచీలను తగ్గిస్తుందని.. లేదంటే మొత్తానికి గోల్డ్ బాండ్స్ పథకాన్నే ఎత్తేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ ఆర్బీఐ తాజాగా గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడంప్షన్ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకూ తేదీలను ప్రకటించింది.

ఈ సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో చేరి ఐదేళ్లు పూర్తయితే కనుక ముందస్తు ఉపసంహరణ కోసం అప్లై చేసుకోవచ్చు. 2017-18 సిరీస్ నుంచి 2019-20 సిరీస్ వరకూ మొత్తం 30 ట్రాంచీలకు సంబంధించి ఆర్బీఐ ప్రీమెచ్యూర్ విత్ డ్రా తేదీలను ప్రకటించింది. గతంలో ప్రతి నెలా ఈ బాండ్ విడతలను జారీ చేసేది. ఇటీవల కాలంలో ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున ఆర్థిక ఏడాదిలో నాలుగు ట్రాంచీలను ఇస్తుంది. 2017-18 సిరీస్ ని 2017లో మే 12న జారీ చేయగా, 2024లో నవంబర్ 12న కూపన్ పేమెంట్ గా ఉంది. దీని కోసం అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకూ అప్లై చేసుకోవచ్చు. 2017-18 సిరీస్ కి సంబంధించి మొత్తం 14 ట్రాంచీలు, 2018-19కి సంబంధించి 6  ట్రాంచీలు, 2019-20కి సంబంధించి 10 ట్రాంచీలు మొత్తం మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 30 ట్రాంచీల తేదీలు ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ ఉన్నాయి.