iDreamPost
android-app
ios-app

Fixed Vs Floating.. రెండింటిలో లోన్ పై ఏ వడ్డీ రేటు తక్కువ?

  • Published Nov 20, 2024 | 3:34 PM Updated Updated Nov 20, 2024 | 3:34 PM

Fixed Vs Floating: మనం లోన్ తీసుకునేటప్పుడు రెండు వడ్డీ రేట్లు ఉంటాయి. అవి ఫిక్స్డ్ వడ్డీ రేట్లు, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు.

Fixed Vs Floating: మనం లోన్ తీసుకునేటప్పుడు రెండు వడ్డీ రేట్లు ఉంటాయి. అవి ఫిక్స్డ్ వడ్డీ రేట్లు, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు.

Fixed Vs Floating.. రెండింటిలో లోన్ పై ఏ వడ్డీ రేటు తక్కువ?

మనలో చాలా మందికి కూడా ఈ విషయం తెలీకపోవచ్చు. లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఫ్లోటింగ్ రేట్స్, ఫిక్స్‌డ్ రేట్లు. అసలు ఈ వడ్డీ రేట్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిక్స్‌డ్ రేట్స్ అంటే స్థిర వడ్డీ రేట్లు అన్నమాట. ఇక్కడ వడ్డీ రేట్లు మారవని గుర్తుంచుకోవాలి. అంటే.. మీ లోన్ టెన్యూర్ అయిపోయే దాకా కూడా వడ్డీ రేట్లు అలాగే ఉంటాయి. ఈఎంఐ కూడా ఆ వడ్డీ రేట్ల ప్రకారమే కట్టాల్సి ఉంటుంది. ఏం మారదు. ఫ్లోటింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారుతుంటుంది. బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి.. మార్కెట్ పరిస్థితుల్ని బట్టి వడ్డీ రేట్లు ఇందులో మారుతూ ఉంటాయి. అంటే మీరు తీసుకున్న లోన్‌కు నెలకు ఎంత ఈఎంఐ కట్టాలనే దానిపై క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇందులో వడ్డీ రేట్లు ప్రతి నెలా కూడా మారే అవకాశాలు ఉంటాయి.

ఇక ఫిక్స్‌డ్ రేట్ల కంటే.. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు సాధారణంగానే తక్కువగా ఉంటాయి. అయితే ఈ రెండు వడ్డీ రేట్లలో ఏ వడ్డీ రేట్ తో లోన్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. ఫిక్స్డ్ రేట్లలో మార్పులు ఉండవు. కానీ ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్లలో మార్పులు ఉంటాయి. అంటే RBI రేపో రేట్లు పెంచితే ఫ్లోటింగ్ రేట్లు పెరుగుతాయి. తగ్గిస్తే తగ్గుతాయి. అయితే ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్లతో పోలిస్తే ఇందులో వడ్డీ రేట్లు కొంచెం తక్కువే ఉంటాయి. భవిష్యత్తులో పెరగచ్చు. తగ్గవచ్చు. లేదా స్థిరంగా అయినా ఉండవచ్చు. కానీ లోన్ త్వరగా క్లోజ్ చేయాలనుకునే వారికి ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్లు బెటర్. ఎందుకంటే మనం లోన్ త్వరగా క్లోజ్ చేయాలనుకుంటునప్పుడు ప్రీ క్లోజర్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అంటే మనం లోన్ ముందుగా క్లోజ్ చేసుకునేటప్పుడు 1 లక్ష 60 వేలు లేదా అంతకన్నా ఎక్కువ అదనంగా ఛార్జీలు కట్టాలి. అయితే ఈ చార్జెస్ కేవలం ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్లతో లోన్ తీసుకున్న వారికి మాత్రమే అప్లై అవుతాయి. ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్లతో లోన్ ముందుగానే తీర్చేసే వారికి ఈ ఛార్జీలు పడవని RBI చెబుతుంది.

దీన్ని బట్టి షార్ట్ టెన్యూర్ తో లోన్లు తీర్చేవారికి ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్లు బెటర్. లాంగ్ టెన్యూర్ తో లోన్లు తీర్చేవారికి ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్లు బెటర్. ఒక వేళ మీరు లోన్ తీసుకొని దాన్ని మీ టెన్యూర్ కంటే ముందుగా తీర్చాలనుకుంటున్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లతో లోన్లు తీసుకోవడం మంచిది. లేదు లాంగ్ టెన్యూర్ తో లోన్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఫిక్స్డ్ రేట్లతో లోన్ తీసుకోవచ్చు. కానీ లాంగ్ టెన్యూర్ తో లోన్లు తీర్చేటప్పుడు మీకు ఫైనల్ గా వడ్డీ ఎక్కువ పడుతుంది. ఈ విషయాలు తెలుసుకొని లోన్ తీసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్నికింద కామెంట్ రూపంలో తెలియజేయండి.