iDreamPost
android-app
ios-app

అక్టోబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

  • Published Sep 18, 2024 | 11:00 PM Updated Updated Sep 18, 2024 | 11:00 PM

Bank Holidays in October 2024: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. దాదాపు నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మొత్తం ఎన్నిరోజులంటే?

Bank Holidays in October 2024: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. దాదాపు నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మొత్తం ఎన్నిరోజులంటే?

అక్టోబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

మరికొన్ని రోజుల్లో సెప్టెంబర్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. ఈ నెల ముగిసిపోయి అక్టోబర్ నెల రానుంది. ఇక ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ లో కూడా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ లో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ నెలకు సంబంధించిన సెలవుల లిస్టును ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయనేది గుర్తుంచుకోవాలి. బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు తమ బ్యాంక్ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సెలవులు ఎప్పుడున్నాయో తెలియకపోతే మీ పనుల్లో జాప్యం జరుగుతుంది. అలాగే సమయం కూడా వృథా అవుతుంది. మరి అక్టోబర్ లో మొత్తం ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం?

ప్రస్తుత కాలంలో బ్యాంకు సేవలు ఆన్ లైన్ ద్వారా పొందే సౌకర్యం ఉంది. ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్, డెబిట్, లోన్స్ కోసం నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవేమీ సమస్యలు లేకుంటే దాదాపు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. అయినప్పటికీ బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక అక్టోబర్ నెలలో ఏకంగా 12 రోజులు సెలువులు ఉండనున్నాయి. మీకు బ్యాంక్ పనులు ఉన్నట్లైతే ముందుగానే చూసుకోండి. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్‌తేరాస్‌, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. శనివారాలు.. ఆదివారాలు కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే:

  • అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాకులకు సెలవు.
  • అక్టోబర్‌ 3న నవరాత్రి వేడుకలు ప్రారంభం. మహారాజా అగ్రసేన్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 6న ఆదివారం బ్యాంకుల మూసివేత.
  • అక్టోబర్ 10 మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
  • అక్టోబర్‌ 11న మహానవమి సందర్భంగా మూసివేత.
  • అక్టోబర్‌ 12న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
  • అక్టోబర్‌ 13న ఆదివారం కావడంతో సెలవు.
  • అక్టోబర్‌ 17న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.
  • అక్టోబర్‌ 20న ఆదివారం సెలవు.
  • అక్టోబర్ 26న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.
  • అక్టోబర్‌ 27న ఆదివారం సెలవు.
  • అక్టోబర్ 31న దీపావళి, సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ సందర్భంగా సెలవు.