P Venkatesh
Bank Holidays in September 2024: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ నెలలో భారీగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. పనులుంటే ముందే చూసుకోండి. మొత్తం ఎన్ని రోజులంటే?
Bank Holidays in September 2024: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ నెలలో భారీగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. పనులుంటే ముందే చూసుకోండి. మొత్తం ఎన్ని రోజులంటే?
P Venkatesh
ఇంకో వారం రోజుల్లో ఆగస్టు నెల ముగియనున్నది. ఈ ఏడాది మరో కొత్త నెల ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. ఇక ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ లో దాదాపు సగం రోజులు బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. బ్యాంకు సెలవులకు సంబంధించిన లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యాంకు సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతుంటాయనే విషయాన్ని ఖాతాదారులు గమనించాలి. సెప్టెంబర్ లో మొత్తం 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇంతకీ ఏయే తేదీల్లో సెలవులు ఉండనున్నాయంటే?
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మీకు ఏమైనా బ్యాంకు పనులుంటే సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నయో తెలుసుకోండి. లేదంటే మీ పనుల్లో జాప్యం, సమయం వృథా అవుతుంది. 14 రోజుల సెలవుల్లో శని, ఆదివారాలు, పండగలు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. బదులుగా నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.