మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు […]
దేశం గర్వపడే వీరుడు పృథ్వీరాజ్ పాత్రను పోషిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ సూద్, అషుతోష్ రాణా, సాక్షి తన్వర్ లాంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. మనూషీ చిల్లార్ తొలిసారి వెండితెర అరెంగ్రేటమిది. బహుబలి రేంజ్ లో రికార్డులను టార్గెట్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేదీ భయంతెలియని యోధుడు పృథ్విరాజ్ చౌహన్ నిజజీవితం ఆధారంగా యాష్ రాజ్ ఫిల్మ్ తీర్చిదిద్దిన మూవీ పృథ్విరాజ్. మహ్మమథ్ ఘోరీ భయంకర దాడుల నుంచి […]
ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయా?.. ఆయనను హత్య చేస్తామంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అందిన ఒక ఈమెయిల్ ఇదే అనుమానాన్ని, ఆందోళనను రేకెత్తిస్తోంది. భద్రతావర్గాల్లో సదరు ఈమెయిల్ కలకలం రేపింది. ప్రధానమంత్రిని హతమార్చడానికి స్లీపర్ సెల్స్ ను రెడీగా ఉంచామని దుండగులు మెయిల్ ద్వారా హెచ్చరించారు. దాంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ఆ ఈమెయిల్ ను కేంద్ర హోంశాఖకు, ఇతర అన్ని భద్రతా విభాగాలకు పంపారు. అప్రమత్తమైన హోంశాఖ దీనిపై అత్యున్నత […]
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన తరపున వ్యూహకర్తగా పని చేసేందుకు సిద్ధమని మూడు రోజుల క్రితం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్ కు మద్దతు తెలిపిన వారందరినీ కలిసి కృతజ్ఞతలు చెబుతున్నానని.. అందులో […]
ఫిబ్రవరిలో విడుదలైన పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. అది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం కావడంతోనే బీజేపీ ఓడిందని అనుకున్నారు. మూడు రోజుల క్రితం కర్ణాటకలో కూడా బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. […]
దేశంలోనే అతి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య గురువారం జరిగింది. సాయంత్రం 5.30 సమయానికి అందిన సమాచారం ప్రకారం 76 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి దశలోనూ భారీ పోలింగ్ నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినా.. మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు.. బెంగాల్ ఒక ఎత్తు అన్నట్లు […]
కరోనా.. ఓ ప్రపంచ మహమ్మారి. భూమిపై బతికున్న ఏ ఒక్కరూ ఇప్పటిదాకా చూడని మహా విపత్తు. 31 లక్షల మందిని బలి తీసుకున్న రాకాసి. రోజూ వేల మందిని చంపుతూనే ఉంది. ఇండియాలో అయితే.. ఎక్కడా లేనంతగా రికార్డు స్థాయిలో వైరస్ బారిన పడుతున్నారు. రోజూ 3.5 లక్షల కేసులు, రెండున్నర వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పుడున్నది నేషనల్ ఎమర్జెన్సీ లాంటిదే. కానీ పరిస్థితులు రోజురోజుకూ చేయి దాటిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉంది. ఏమీ […]
దేశం వెలిగిపోతోంది.. ఇది బీజేపీ స్లోగన్. కానీ ఇప్పుడు కరోనా సునామీలో భారత దేశం మునిగిపోతోంది. వైరస్ తో పోరులో గెలిచామంటూ ముందే సంబరాలు చేసుకున్న ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం జాగ్రత్తే మందు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని.. భారమంతా రాష్ట్రాలపై వేశారు. నరేంద్ర మోడీ.. ఎప్పుడు ఏది మాట్లాడాలో.. ఎక్కడ ఏ స్విచ్ నొక్కాలో తెలిసిన వ్యక్తి! ఏడేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నా ఒక్కసారి కూడా ప్రెస్ […]
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది. కరోనా మొదటి వేవ్ లో ప్రజల దగ్గర నుంచి పీఎం కేర్ ఫండ్స్ పేరుతో భారీగా విరాళాలు పోగు చేసిన కేంద్ర ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆ డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ లు నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు నిర్వర్తించడం పైనే విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్లను పిఎం కేర్ విరాళాలతో నిర్మించాలని తాజాగా కేంద్ర […]