iDreamPost
android-app
ios-app

బ్రూనైలో ప్రధాని మోదీ పర్యటన. 7వేల లగ్జరీ కార్ల రారాజు సుల్తాన్ ఆతిథ్యం!

Brunei Sultan Hassanal Bolkiah: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రూనై వెళ్లనున్నారు. మంగళవారం మోదీ బ్రూనై చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాన్ని పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆ దేశ చక్రవర్తి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Brunei Sultan Hassanal Bolkiah: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రూనై వెళ్లనున్నారు. మంగళవారం మోదీ బ్రూనై చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాన్ని పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆ దేశ చక్రవర్తి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రూనైలో ప్రధాని మోదీ పర్యటన. 7వేల లగ్జరీ కార్ల రారాజు సుల్తాన్ ఆతిథ్యం!

ప్రపంచంలో అనేక దేశాల్లో వివిధ రకాల పాలన వ్యవస్థ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే..మరికొన్ని దేశాల్లో రాచరికపు వ్యవస్థ ఉంటాది. నేటికి పలు దేశాలను రాజులు, చక్రవర్తులో పాలిస్తున్నారు. అలాంటి దేశాల్లో ఒకటి బ్రూనై. హస్పనల్ బోల్కియా అనే  చక్రవర్తి ఈ దేశాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంతనవంతులైన రాజుల్లో ఈయన ఒకరు. 10మంది అంబానీలు ఈయనకు సాటి రారని కొందరి అభిప్రాయం. ఆయన దగ్గర 7 వేల కార్లు ఉన్నాయి. ఈ రాజు..మన దేశ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాన్ని పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. బ్రూనైతో 40 ఏళ్ల దౌత్య సంబంధాల సంబంధాలను బలోపేతం చేసే విధానంగా భాగంగా మోదీ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది. ఇక ఈ దేశా రాజు గురించి చూసినట్లు అయితే.. హస్సనల్ బోల్కియా అత్యంత సంపన్నుడిగా విలసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈయనకు ఎక్కువగా ఆదాయం బ్రూనై చమురు, గ్యాస్ నిల్వల నుంచి వస్తుంది

సంపాదన విషయం పక్కన పెడితే.. ఆయనకు మరో ప్రత్యేకమన ఘనత ఉంది. ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కార్లను ఆయన కలిగి ఉన్నారు. హస్పనల్ బోల్కియా వద్ద దాదాపు 7 వేలకు పైగా లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షల కోట్లు వరకు ఉంటుంది. హస్పన్ల దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ది సన్ ప్రకారం.. దాదాపు 450 ఫెరారీలు, 380 బెంట్లీలు కార్లు ఉన్నాయి. హస్సనల్ బోల్కియా గ్యారేజీలో పోర్షెస్, లంబోర్ఘినిస్, మేబ్యాక్స్, జాగ్వార్‌లు, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్స్‌లను వంటి టాప్ మోడల్ కార్లు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

సుల్తాన్ 2007లో తన కుమార్తె ప్రిన్సెస్ మజిదేదా వివాహం కోసం కస్టమ్ బంగార పూత ఉన్న రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో బెంట్లీ డామినేటర్ ఎస్ యూవీ ఒకటి. దీని విలువ సుమారు 80 మిలియన్ డాలర్లు ఉంటుంది. అలానే  పోర్షే 911 హారిజన్ బ్లూ పెయింట్, ఎక్స్88 పవర్ వంటి అనేక రకాల ఖరీదైన కార్లు ఉనన్నాయి.  ఓపెన్ రూఫ్, కస్టమ్-డిజైన్ రోల్స్ రాయిస్ కార్లకు బంగారం పూతతో రూపొందించారు.

హస్సనల్ బోల్కియా ఉంటున్న నివాసం కూడా ప్రత్యేకమే. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ ప్యాలెస్ మరో ఇంద్ర భవనంలా ఉంటుంది. 5 స్విమ్మింగ్ పూల్స్, 1,700 బెడ్‌రూమ్‌లు, 257 బాత్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆయనకు బోయింగ్ 747 విమానం కూడా ఉంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బ్రూనై చక్రవర్తి ఉన్నారు. ఇలాంటి లగ్జరీ కార్ల రారాజు..మన దేశ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బ్రూనై రాజు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.