iDreamPost
android-app
ios-app

Modi Govt: దేశంలోని అన్నదాతలందరికీ మోదీ సర్కార్‌ శుభవార్త.. అతి తక్కువ ధరకే

  • Published Aug 03, 2024 | 9:12 AM Updated Updated Aug 03, 2024 | 9:12 AM

Modi Govt-Fertilizers, Farmers: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రైతులకు శుభవార్త చెప్పింది. వారికి తక్కువ ధరకే వాటిని అందిస్తామని గ్యారెంటీ ఇచ్చింది. ఆ వివరాలు..

Modi Govt-Fertilizers, Farmers: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రైతులకు శుభవార్త చెప్పింది. వారికి తక్కువ ధరకే వాటిని అందిస్తామని గ్యారెంటీ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 03, 2024 | 9:12 AMUpdated Aug 03, 2024 | 9:12 AM
Modi Govt: దేశంలోని అన్నదాతలందరికీ మోదీ సర్కార్‌ శుభవార్త.. అతి తక్కువ ధరకే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. పెట్టుబడి సాయం, మద్దతు ధర అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇక బడ్జెట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ.. భారీ మొత్తం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ యోజన నిధుల పెంపుపై నిర్ణయం ఉంటుందని భావించారు. కానీ మోదీ సర్కార్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకు ముందు ఇచ్చిన 6 వేల రూపాయలనే కొనసాగించనుంది. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు భారీ శుభవార్త చెప్పింది. వారికి తక్కువ ధరకే అన్నదాతలకు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయంలో ఎంతో కీలకమైన ఎరువులను తక్కువ ధరకే సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశానికి వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి.. రైతులకు భారీగా లాభాలు వచ్చేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గత పదేళ్లుగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. దేశంలోని రైతులకు చేసిన సాయాన్ని.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సమయంలోనే దేశంలోని రైతులను అన్ని రకాలుగా ఆదుకుని.. వ్యవసాయాన్ని పండగ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇకపై కూడా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు లభిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు చౌకగా ఎరువులను అందిస్తామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా రూ. 2,366 విలువ గల యూరియాను రైతులకు కేవలం రూ. 266 కే అందిస్తామని అలానే రూ. 2,433 విలువ గల డీ-అమ్మోనియం ఫాస్పేట్(డీఏపీ)ని.. రూ. 1,350 కే అందించనున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ మొత్తం 2013-14లో రూ. 71,280 కోట్లు ఉండగా.. అది 2023-24 నాటికి రూ. 1,95,420 కోట్లకు పెరిగిందని ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా పెరిగిన డీఏపీ ధరల భారాన్ని.. ఎట్టి పరిస్థితుల్లో రైతులపై పడనీయమని.. అంతేకాక వారికి గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 2,625 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు.