Vinay Kola
PM AASHA: రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలని ప్రవేశ పెడుతూ ఉంటుంది. ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షన్ అభియాన్ (PM AASHA) రైతులకు వారి ఉత్పత్తులకు సరసమైన ధరను నిర్ధారించడానికి ఉద్దేశించిన పథకం.
PM AASHA: రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలని ప్రవేశ పెడుతూ ఉంటుంది. ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షన్ అభియాన్ (PM AASHA) రైతులకు వారి ఉత్పత్తులకు సరసమైన ధరను నిర్ధారించడానికి ఉద్దేశించిన పథకం.
Vinay Kola
రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలని ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇక అలా రైతులకు మేలు చేసే పథకాలలో పీఎం-ఆశా పథకం ఒకటి. ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షన్ అభియాన్ (PM AASHA) అనేది రైతులకు ఇంకా వారి ఉత్పత్తులకు సరసమైన ధరను నిర్ధారించడానికి ఉద్దేశించిన పథకం. ఈ నేపథ్యంలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకానికి రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతులకు అందుబాటు ధరలకే ఎరువులను నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2024 రబీ సీజన్‌లో పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా రైతులకు మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల రైతుల సాగు ఖర్చు తగ్గుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు కనీస ధరలు లభించనున్నాయి. ఇటువంటి పంటలని సాగు చేస్తే దేశం వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు వెళ్తుంది. బాగా అభివృద్ధి చెందుతుంది. రైతులు కష్టాలు కూడా తీరుతాయి. అందువల్ల వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. రైతుల కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం వలన వారి ఆదాయం ఇంకా పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.