Dharani
Ayushman Bharat Health Cover: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఆ వివరాలు..
Ayushman Bharat Health Cover: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పేదలు, సామాన్యుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో అనేక రకాల పథకాలు తీసుకు వచ్చింది. ఈక్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. దీని వల్ల ఒక్కో కుటుంబానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. ఇంతకు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఆ నిర్ణయం ఏంటి.. దీనికి ఎవరు అర్హులు.. వంటి పూర్తి వివరాలు మీ కోసం..
పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వార ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్య బీమా కవరేజ్ లభించనుంది. ఈ క్రమంలో ఈ పథకానికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఆయుష్మాన్ భారత్ పథకం మొత్తాన్ని10 లక్షల రూపాయల వరకు పెంచాలని భావిస్తోందట. అదే మహిళలకు అయితే ఈ మొత్తాన్ని 15 లక్షల రూపాయల వరకు పెంచాలని నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఆ వివరాలు..
ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న బీమా ఇన్సూరెన్స్ కవరేజీ మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే యోచనలో ఉందట. మహిళలకు అయితే దీనిని రూ. 15 లక్షలకు పెంచే యోచనలో ఉంది. ఇక కుటుంబానికి ఇంత మొత్తం వైద్య ఖర్చుల కింద వస్తుందన్నమాట. రానున్న ఐదేళ్లలో ఈ స్కీం లబ్ధిదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐదేళ్ల లోపు లబ్ధిదారుల సంఖ్యను పెంచడంపై సెక్రటరీ బృందం తన సిఫార్సుల్ని సమర్పించింది. 9 మంత్రిత్వ శాఖలతో కూడిన సెక్రటరీ బృందం.. త్వరలోనే కప్‌బోర్డ్ సెక్రటరీకి ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం దాదాపు 7.22 లక్షల వ్యక్తిగత ప్రైవేట్ ఆస్పత్రి పడకలు ఉన్నాయి. 2026-27 నాటికి వీటిని 9.32 లక్షలకు, 2028-29 కల్లా 11.12 లక్షలకు పెంచాలని కేంద్ర మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 30 వరకు దాదాపు 7.37 కోట్ల మంది ప్రజలు ఈ స్కీం కింద ఆస్పత్రిల్లో జాయిన్ అయ్యి వేర్వేరు చికిత్సలు పొందారు.
గతేడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆయుష్మాన్ కార్డుల్లో మొత్తం మహిళల వాటా 49 శాతంగా ఉంది. ఈ స్కీం కింద ఆమోదం పొందిన అన్ని ఆస్పత్రుల్లో దాదాపు 48 శాతం మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం.