iDreamPost
android-app
ios-app

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..కొత్తగా మరో 5 జిల్లాలు ఏర్పాటు!

New Districts in Ladakh: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఐదు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

New Districts in Ladakh: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఐదు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..కొత్తగా మరో 5 జిల్లాలు ఏర్పాటు!

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తరచూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా జమ్ముకశ్మీర్ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ సంబంధంచి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కొత్తగా మరో 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. సోమవారం వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ నుంచి విడిపోయి.. లడక్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కేవంలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 7కు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలను.. లడఖ్‌లోని ప్రతి కుటుంబానికి అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లడఖ్‌లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ట్విటర్ వేదికగా హోం మంత్రి ప్రకటించారు. అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన ప్రాంతంగా లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగానే ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామని అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలోనే ఆ కొత్త జిల్లాల పేర్లను కూడా ప్రకటించారు. జన్‌స్కర్, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌ అనే పేర్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు పెట్టినట్లు వివరించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ పాలన మరింత పటిష్ఠం అవుతుందని అమిత్ షా చెప్పారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం అందేచే అభివృద్ధి సంక్షేమ ఫలాలు లడఖ్ లోని ప్రతి గడపకు చేరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. లడఖ్‌ ప్రజల క్షేమం, మెరుగైన పాలనకు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఒక ముందడగని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువ అవుతాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసింది. అందులో జమ్మూ కాశ్మీర్ ఒకటి కాగా.. లడఖ్ మరొకటిగా ఉంది. మరి.. తాజాగా కేంద్ర హోం శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.