Raj Mohan Reddy
స్టార్ హీరోయిన్ శ్రీలీల వేవ్స్ సదస్సుపై ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ గారి స్పీచ్ తనకెంతో నచ్చిందని, చాలా అద్భుతంగా ఉందని శ్రీలీల అన్నారు.
స్టార్ హీరోయిన్ శ్రీలీల వేవ్స్ సదస్సుపై ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ గారి స్పీచ్ తనకెంతో నచ్చిందని, చాలా అద్భుతంగా ఉందని శ్రీలీల అన్నారు.
Raj Mohan Reddy
ముంబైలో గురువారం వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం వేవ్స్ 2025కు నాంది పలికిందని మోదీ పేర్కొన్నారు.భారత్‌లో ఆరు లక్షల గ్రామాలున్నాయని.. మన పల్లెల్లోని ప్రతి వీధి ఒక కథ చెబుతుందని ప్రధాని చెప్పారు. శివుడి ఢమరుకం సృష్టిలోని తొలి శబ్ధమని మోదీ అన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే వేవ్స్ అవార్డులను ప్రవేశపెడతామని , సినిమా వల్ల మనదేశ ఘనత నలుదిశలకు వ్యాప్తి చెందిందని మోదీ అన్నారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి, ఏఆర్ రెహమాన్ తదితరులు భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారని మోదీ ప్రశంసించారు. ఇక వేవ్స్ సదస్సులో స్టార్ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేవ్స్ సదస్సుపై ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాన నరేంద్ర మోదీ గారి స్పీచ్ తనకెంతో నచ్చిందని, చాలా అద్భుతంగా ఉందని శ్రీలీల అన్నారు. వాణిజ్యంలో పెట్టుబడి పెట్టమని ప్రధాని మోదీ చెప్పిన విధానం తనకు బాగా నచ్చిందని శ్రీలీల తెలిపారు. వేవ్స్ సమ్మిట్ అద్భుతంగా ఉందని నిర్వాహకులను ఆమె ప్రశంసించారు.