iDreamPost
android-app
ios-app

పేరు మారిన వందే భారత్ మెట్రో రైలు.. కొత్త పేరు ఇదే

  • Published Sep 16, 2024 | 6:27 PM Updated Updated Sep 16, 2024 | 6:27 PM

Vande Metro Train: దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ మెట్రో రైలును నేడు ( సెప్టెంబర్ 16న) గుజరాత్‌లోని భుజ్ – అహ్మదాబాద్ మధ్య నడిచేందుకు గ్రాండ్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు ప్రారంభానికి కొన్ని గంటల ముందే పేరు మార్చినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Vande Metro Train: దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ మెట్రో రైలును నేడు ( సెప్టెంబర్ 16న) గుజరాత్‌లోని భుజ్ – అహ్మదాబాద్ మధ్య నడిచేందుకు గ్రాండ్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు ప్రారంభానికి కొన్ని గంటల ముందే పేరు మార్చినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

  • Published Sep 16, 2024 | 6:27 PMUpdated Sep 16, 2024 | 6:27 PM
పేరు మారిన వందే భారత్ మెట్రో రైలు.. కొత్త పేరు ఇదే

రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను అందుబాదుటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. అంతేకాకుండా.. ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రైల్వే వవ్యస్థను మరింత మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి కొత్తగా దేశంలో మొట్ట మొదటిసారిగా వందేభారత్ మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈ మెట్రో రైలు  నేడు పట్టాలపై పరుగులు పెట్టనుందని ఇది వరకే ప్రకటించారు. కానీ, తాజాగా ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందే దీని పేరు మార్చి ప్రారంభించడం జరిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ మెట్రో రైలును నేడు ( సెప్టెంబర్ 16న) గుజరాత్‌లోని భుజ్ – అహ్మదాబాద్ మధ్య నడిచేందుకు గ్రాండ్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు ప్రారంభానికి కొన్ని గంట ముందే ప్రధాని దీనికి పేరు మార్చారు. కాగా, ఇప్పుడు ఈ రైలు పేరు.. నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పేరు మార్చబడింది. ఇక ఈ విషయాన్ని తాజాగా రైల్వే అధికార ప్రతినిధి నేడు వెల్లడించారు. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రం సాయంత్రం 4:15 గంటలకు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. ఈ రైలు భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు 359 కి.మీ దూరాన్ని 5:45 గంటల్లో చేరుకుంటుంది. కాగా, ఆ సమయంలో రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. ఇక ఈ ర్యాపిడ్ రైల్ లక్ష్యం ఇంటర్‌సిటీ కనెక్టివిటీని పెంచడం.  అయితే సామాన్య ప్రజలు ఈ రైలు సేవలను సెప్టెంబర్ 17 అహ్మదాబాద్ నుంచి పొందగలరు. అలాగే ఈ రైలు ప్రయాణానికి అయ్యే టికెట్ ధర కేవలం రూ.455 మాత్రమే. ఇకపోతే వందే మెట్రో రైలు పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.

ఇక ఈ ర్యాపిడ్ రైల్ లో అనేక కొత్త సాంకేతికతలతో అమర్చి అందుబాటులోకి తీసుకొచ్చారు. పైగా ఇందులో మొత్తం 12 కోచ్‌లు, 1150 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా ర్యాపిడ్ రైల్ ఇతర మెట్రోలకు భిన్నంగా ఉంటుంది. ఈ సేవ నగరాల మధ్య వేగంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. మరీ, వందే భారత్ మెట్రో రైలు పేరు మార్చడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş