iDreamPost
android-app
ios-app

మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా వారి అకౌంట్లలో రూ.10 వేలు

  • Published Sep 18, 2024 | 11:54 AM Updated Updated Sep 18, 2024 | 11:54 AM

కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఫ్రీగా ఆ పథకం పేరిట వారి అకౌంట్ లో రూ.10వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఫ్రీగా ఆ పథకం పేరిట వారి అకౌంట్ లో రూ.10వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Sep 18, 2024 | 11:54 AMUpdated Sep 18, 2024 | 11:54 AM
మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా వారి అకౌంట్లలో రూ.10 వేలు

దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో పేద ప్రజల దగ్గర నుంచి పసి పిల్లలు, వృద్ధులు వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభిస్తున్నారు. అలాగే మహిళలకు కూడా ఆర్థికంగా బలంగా ఉండేందుకు ప్రభుత్వం తమ వంతు ప్రోత్సాహం అందిస్తుంది. ఇందులో భాగంగానే మహిళల పేరిట అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభిస్తూ.. వీటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనికి కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా మోడి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. వారి అకౌంట్ లో ఫ్రీగా రూ.10వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రధాని నరేంద్ర మోడి ఇటీవలే ఒడిశా రాష్ట్రంలోని పర్యటిస్తూ.. అక్కడ పలు ప్రాజెక్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఒడిశా మహిళలకు మోడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రకటించిన సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించి.. ఈ పథకం కింద ఒడిశాలోని అర్హులైన మహిళలకు ప్రతి ఏటా రూ.10 వేలు అకౌంట్ లో జమ చేయనుందని తాజాగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఈ సుభద్ర యోజన కింద 60 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, ఒడిశా ప్రభుత్వం నిధులను కూడా కేటాయించింది. ఈ క్రమంలోనే సుభద్ర యోజన కింద ఒడిశాలోని కోటి మంది మహిళ లబ్ధిదారులు ఖాతాల్లో రూ.10 వేలు వేయనున్నారు. ఇకపోతే దీనిని ఈ నిధులను రెండు విడతల్లో మహిళ ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు.  అనగా.. రూ.5 వేలు చొప్పున ఏటా మొత్తం ఒక్కో మహిళ అకౌంట్లో రూ. 10 వేలు వేయనున్నారు.

ఇకపోతే ఈ సుభద్ర యోజన కింద ఒడిశాలోని 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల 10 లక్షల మంది మహిళల ఖాతాల్లో మంగళవారం ప్రభుత్వం డబ్బులు జమ చేశారు. అయితే 2024-25 నుంచి 2028-29 వరకూ 5 ఏళ్ల పాటు ఏటా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. కాగా, ఈ పథకం కోసం ఒడిశఆ ప్రభుత్వం సుమారు రూ..55,825 కోట్లు కేటాయించింది. అలాగే ఈ పథకం ఒడిశాలోని మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు  తీసుకువచ్చింది. అయితే ఈ పథకంకు సుభద్ర యోజన అని పేరు పెట్టాడానికి కారణం ఉంది. ఎందుకంటే.. సుభద్ర మాత ఒడిశా ప్రజలచే నిత్యం పూజలందుకునే జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి సోదరి. అందుకే ఈ పేరు పెట్టినట్లు ఒడిశా బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మరి,  ఒడిశా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సుభద్ర యోజన పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.