Dharani
Union Budget 2024-PM Kisan Amount: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. నేడు సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈక్రమంలో రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
Union Budget 2024-PM Kisan Amount: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. నేడు సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈక్రమంలో రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
Dharani
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం.. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఏడాదికి సంబంధించి.. పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు అనగా.. జూలై 23 మంగళవారం నాడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్.. ఏడోసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టి.. ఏడో సార్లు పద్దు ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్‌గా రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయంలో ఆమె మొరార్జీ దేశాయ్‌ను అధిగమించనున్నారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్.. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. వీరిలో రైతు సంఘాల వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మలమ్మతో భేటీ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా రెండు డిమాండ్స్‌ను ఆమె ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో భాగంగా రైతులకు ప్రతి ఏటా 8 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు సమాచారం. ఆ వివరాలు..
రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా.. అన్నదాతలకు ప్రతి ఏటా ఎకరాకు రూ.6 వేల రూపాయల సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని రూ.6-రూ.8 వేలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పంటకు మద్దతు ధర అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో దీనిపై కీలక ప్రకటన రానుంది.
అన్నదాతలను ఆదుకోవడం కోసం.. కేంద్ర ప్రభుత్వం.. తొలిసారిగా 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్‌ను ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం మొదలైన నాటి నుంచి.. ఇప్పటి వరకు ప్రతి ఏటా అర్హులైన వారికి ఏటా ఎకరానికి రూ. 6 వేలు నగదు సాయం అందిస్తుంది. ఈ డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోనే జమచేస్తుంది. ప్రతి ఏటా మూడు విడతలుగా.. 4 నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున అందిస్తుంది కేంద్రం.
పీఎం కిసాన్ స్కీమ్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు 17 విడతల డబ్బులు అనగా సుమారు 34 వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మోదీ తొలి సంతకం కూడా పీఎం కిసాన్ 17వ విడత చెల్లింపుల ఉత్తర్వుల మీదనే చేయడం విశేషం. ఇక త్వరలోనే 18వ విడత కిసాన్ సాయం.. నిధులు రైతులకు అందనున్నాయి. ఇవి సెప్టెంబర్ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.