Swetha
భారతదేశ ప్రధాన నరేంద్ర మోడీ 75 వ పుట్టిన రోజు సంధర్బంగా.. సోషల్ మీడియాలో సినీ , రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మోడీ బర్త్ డే సందర్బంగా ఓ భారీ అనౌన్సుమెంట్ వచ్చింది. అదేంటంటే నరేంద్ర మోడీ జీవిత చరిత్రను బయో పిక్ రూపంలో.. పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

భారతదేశ ప్రధాన నరేంద్ర మోడీ 75 వ పుట్టిన రోజు సంధర్బంగా.. సోషల్ మీడియాలో సినీ , రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మోడీ బర్త్ డే సందర్బంగా ఓ భారీ అనౌన్సుమెంట్ వచ్చింది. అదేంటంటే నరేంద్ర మోడీ జీవిత చరిత్రను బయో పిక్ రూపంలో.. పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖ జీవిత చరిత్రలను అందరికి తెలిసేలా ఇలా బయో పిక్స్ రూపంలో ముందుకు తీసుకునివస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీపై బయో పిక్ తీయడం అనేది నిజంగా అభినందించతగిన విషయం అని చెప్పి తీరాలి.
మలయాళ హీరో ముకుందన్ ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ క్యారెక్టర్ ను చేస్తున్నాడు. ఈ బయోపిక్ కు “మా వందే” అనే టైటిల్ ని ఫిక్స్ చేసి రివీల్ చేశారు. పైగా దీనికి ట్యాగ్ లైన్ గా ‘ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది’ అనే లైన్ లో యాడ్ చేశారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషలతో పాటు.. ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ సినిమాకు క్రాంతి కుమార్ సి హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నారు. ఇలా పవర్ ప్యాక్డ్ గా అంతా ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ముందు ముందు ఈ బయో పిక్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.