సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతో పాపులరయ్యే కంగనా రౌనత్ తాజాగా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివను టార్గెట్ చేసింది. నిన్న విడుదలైన ఈ విజువల్ గ్రాండియర్ టాక్ ఏమంత గొప్పగా లేనప్పటికీ పబ్లిసిటీ పుణ్యమాని భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ధూమ్ 3 లాంటి చిత్రాల పేరు మీదున్న రికార్డును దాటేసి ఆరు కోట్లకు పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ భారీ వసూళ్లు ఇస్తున్నారు. వీకెండ్ సహజంగాన్ రన్ […]
ఇప్పుడంటే సైమా, ఈఫాలంటూ బోలెడొచ్చాయి కానీ ఒకప్పుడు జాతీయ అవార్డుల తర్వాత అంత స్థాయిలో గుర్తింపు ఉన్నది ఫిలిం ఫేర్ పురస్కారాలకే. ఇది అందుకుంటే ఏదో ఇండియన్ ఆస్కార్ గెలుచుకున్నంత సంబరంగా ఉండేది నటీనటులకు. మొదట్లో హిందీ సినిమాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు తర్వాత దీన్ని సౌత్ కి కూడా విస్తరించి గ్రాండ్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా దీని మీద కూడా వివాదాలు, రాజకీయ మరకలు, ప్రలోభాలు లాంటి ఆరోపణలు చుట్టుముట్టాయి కానీ వేటికీ సరైన ఆధారాలు […]
కొన్ని నమ్మశక్యంగా ఉండవు. వారం క్రితం రిలీజైన ఒక హిందీ సినిమాకు మొన్న దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం కలెక్షన్ కేవలం 4 వేల 500 రూపాయలు అంటే షాక్ కలగక మానదు. కానీ ఇది నమ్మలేని వాస్తవం. కంగనా రౌనత్ నటించి ప్రధాన పాత్ర పోషించిన దాఖడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత చెత్త వసూళ్లు రాబట్టుకుంటోంది. బాలీవుడ్ లో కనివిని ఎరుగని డిజాస్టర్ గా నమోదయ్యేందుకు అన్నిరకాలుగా కష్టపడుతోంది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ […]
ఇంకో శుక్రవారానికి బాక్సాఫీస్ రెడీ అవుతోంది. 12న వచ్చిన సర్కారు వారి పాట దూసుకుపోతూ ఉండగా దానికి పోటీగా కేవలం వారం గ్యాప్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ‘శేఖర్’. జీవిత దర్శకత్వంలో మలయాళం హిట్ మూవీ జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మొదటిసారి రాజశేఖర్ పూర్తిగా మాసిపోయిన తెల్లని గెడ్డం, జుట్టుతో నటించారు. ఒక యాక్సిడెంట్ కు సంబంధించిన మెడికల్ మాఫియా గుట్టు బయటికి తీసే రిటైర్డ్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ధాకడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. స్పై, యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా కంగనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మే 16 సోమవారం ఉదయం కంగనా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం చేయించారు. […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోల మీద, బాలీవుడ్ స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కంగనా ధాకడ్ సినిమాతో మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కంగనా. గత వారం రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి బాలీవుడ్ హీరోలు, స్టార్ల పిల్లల గురించి వ్యాఖ్యలు చేసింది. కంగనా […]
మహేష్ బాబు ఇటీవల మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనగా ఓ విలేఖరి మహేష్ ని మీరెప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడతారు అని అడగడంతో మహేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ నన్ను భరించలేదు, నేను నా టైం వేస్ట్ చేసుకొను, నాకు తెలుగులోనే హాయిగా ఉంది అని అన్నారు. అయితే ఈ మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగగా మహేష్ మరో ఇంటర్వ్యూలో దీనిపై నేను తప్పుగా మాట్లాడలేదు అని అతను చేసిన వ్యాఖ్యలకి […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ చాలా ఓపెన్ గా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అన్న సంగతి తెలిసిందే. తనకి నచ్చకపోతే ఎవరి గురించైనా, దేని గురించైనా భయపడకుండా మాట్లాడేస్తుంది. తను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా హోస్ట్ చేసిన కాంట్రవర్సీ షో లాకప్ ఇటీవలే పూర్తయింది. త్వరలో కంగనా ధాకడ్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. […]
అలనాటి హీరోయిన్, తమిళనాడు మాజీ సిఎం జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన తలైవి నిన్న భారీ విడుదలనే దక్కించుకుంది. కంగనా రౌనత్ టైటిల్ పాత్రలో అరవింద్ స్వామి ఎంజిఆర్ గా నటించిన ఈ సినిమా మీద అంచనాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా లేవు కానీ రాజకీయ నేపధ్యాలను ఇష్టపడే వాళ్ళను దీని ప్రమోషన్లు బాగానే ఆకర్షించాయి. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు మన ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో నటిగా తప్ప పొలిటికల్ […]
రేపు మన దృష్టంతా గోపిచంద్ సీటిమార్, నాని టక్ జగదీష్ ల మీదే ఉంది కానీ కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషించిన తలైవి కూడా రేస్ లో ఉంది. అయితే దీనికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన బజ్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. మాజీ నటి కం తమిళనాడు సిఎం కీర్తిశేషులు జయలలిత జీవిత కథను ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఇటీవలే కొందరు ఇండస్ట్రీ పెద్దలకు, బాలీవుడ్ లోని మీడియా ప్రముఖులకు ప్రీమియర్ […]