iDreamPost

కంగనా రనౌత్‌ని కొట్టిన ఈ కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసా?

  • Published Jun 07, 2024 | 3:39 PMUpdated Jun 07, 2024 | 3:39 PM

Kangana Ranaut: చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఒకరు నటి, ఎంపీ కంగనా రనౌత్‌ని కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివారలు..

Kangana Ranaut: చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఒకరు నటి, ఎంపీ కంగనా రనౌత్‌ని కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివారలు..

  • Published Jun 07, 2024 | 3:39 PMUpdated Jun 07, 2024 | 3:39 PM
కంగనా రనౌత్‌ని కొట్టిన ఈ కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసా?

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల మీద ఆసక్తితో ఇంటి నుంచి పారపోయి వచ్చి.. ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. సినిమా అవకాశాలు దక్కించుకుని.. వచ్చిన ప్రతి పాత్రను యాక్సెప్ట్‌ చేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు కంగనా రనౌత్‌. నేడు బాలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ సినిమాలంటే ఫస్ట్‌ అందరికి గుర్తుకు వచ్చే నటి కంగనా రనౌత్‌. హీరోయిన్‌గా మాత్రమే కాక దర్శకురాలిగా కూడా తనెంటో నిరూపించుకుంది కంగనా. ఇక తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి.. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇలా ఉండగా తాజాగా కంగనాకు చేదు అనుభవం ఎదురయ్యింది.

చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ ఒకరు కంగనా రనౌత్‌ మీద చేయి చేసుకుంది. నూతనంగా ఎంపకైన ఎంపీ కంగనా చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. దేశమంతా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఈ ఘటనపై హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. ఇక తాజాగా సదరు మహిళా కానిస్టేబుల్‌ మీద చర్యలు తీసుకుంది హరియాణా ప్రభుత్వం. సదరు సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ.. ఆదేశాలు జారీ చేయడమే కాక ఆమె మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి పయనం అయ్యారు కంగనా రనౌత్‌. గురువారం మధ్యాహ్నం.. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు కంగనా. బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా.. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌.. కంగనాపై చేయి చేసుకున్నారు. ఎంపీ చెంప పగలకొట్టారు. ఊహించని ఘటనతో కంగనా షాక్‌లోకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ తనను కొట్టిన వీడియోను షేర్‌ చేశారు.

ఇక దీనిపై సీఐఎస్‌ఎఫ్‌ మహిళా ఉద్యోగిని మాట్లాడుతూ.. గతంలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. అప్పుడు రైతుల ఉద్యమంలో నా తల్లి కూడా పాల్గొంది. అక్కడ ఉన్న రైతులు 100 రూపాయల కోసం ఉద్యమంలో కూర్చున్నారంటూ కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. రైతులను అవమానించినందుకే ఇప్పుడు ఆమెను కొట్టాను అని చెప్పుకొచ్చింది. ఈ ఘటన మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కానిస్టేబుల్‌ ఎంపీ మీద దాడి చేయడం హాట​ టాపిక్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి