iDreamPost
android-app
ios-app

రాజకీయాలు చేయక.. మేము పానీ పూరి అమ్ముకోవాలా! స్వామిజీపై కంగనా ఫైర్!

ఈ మధ్య కాలంలో స్వయం ప్రకటిత బాబాలు, ఆధ్యాత్మిక గురువులు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా స్వామిజీ ఓ ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోగా.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గట్టి కౌంటరిచ్చారు.

ఈ మధ్య కాలంలో స్వయం ప్రకటిత బాబాలు, ఆధ్యాత్మిక గురువులు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా స్వామిజీ ఓ ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోగా.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గట్టి కౌంటరిచ్చారు.

రాజకీయాలు చేయక.. మేము పానీ పూరి అమ్ముకోవాలా! స్వామిజీపై కంగనా ఫైర్!

ఈ మధ్య కాలంలో కొంత మంది స్వామిజీలు ఆధ్యాత్మిక వ్యాఖ్యల కన్నా.. రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై ఓ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కొందరు ద్రోహం చేశారని, దీని వల్ల చాలా మంది ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని జ్యోతిర్మఠ్ శంకారాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సర్వస్వతి పేర్కొన్నారు. ఉద్ధవ్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయనొక (ఉద్దవ్ థాకరే) ద్రోహి అని, ఉద్ధవ్‌ను మోసం చేసిన వారికి ప్రజలు బుద్ది చెప్పారని, లోక్ సభ ఎన్నికల్లో ఆ ఫలితం కనిపించిందంటూ అన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రజల బాధ తీరదని జ్యోతిర్మఠ్ శంకారాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండీ ఎంపీ కంగనా రనౌత్ స్వామిజీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలు తప్పు బట్టిన ఆమె.. అవిముక్తేశ్వరానందకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. రాజకీయ నేతలు రాజకీయాలు కాకుండా గోల్ గప్ప (పానీ పూరీ) అమ్ముకోవాలా అంటూ ప్రశ్నించింది. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించింది. ‘దేశ ద్రోహీ వ్యాఖ్యలతో అవిముక్తేశ్వరానంద మహారాష్ట్ర ప్రజలందరి మనోభావాలు దెబ్బతీశాడు. రాజకీయాల్తో పొత్తులు, పార్టీల విభజన వంటివి సర్వసాధారణం‘ అని పేర్కొంది కంగన.

’రాజ్యాంగ బద్దంగా ఆమోద యోగ్యం కూడా. కాంగ్రెస్ పార్టీ ఆవిర్బాశం తర్వాత ఇప్పటి వరకు పలుమార్లు చీలిపోయింది. రాజకీయ నాయకులు పాలిటిక్స్ చేయకుండా.. పానీ పూరీ అమ్ముకుంటారా..?’ అని గట్టి కౌంటరిచ్చింది.  సీఎం ఏక్ నాథ్ షిండేను ఉద్దేశిస్తూ అవిముక్తేశ్వరానంద సర్వస్వతి వ్యాఖ్యలు చేయడంతోనే ఈ దుమారానికి తెరలేపింది. కంగనా రనౌత్ లాంటి ఫైర్ బ్రాండ్ కలగజేసుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్న శివసేనపై ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసింది. దీంతో 2022 జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజెపీతో పొత్తుపెట్టుకున్న ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమదే అసలైన శివసేనగా పేర్కొంటున్నాయి ఇరు వర్గాలు. ఇదిలా ఉంటే.. దీన్నే ద్రోహంగా పేర్కొంటూ అవిముక్తేశ్వరానంద సర్వస్వతి వ్యాఖ్యలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి