iDreamPost
android-app
ios-app

భార‌తీయుల కంటే అమెరికన్లు అధ్వానం అంటూ.. కంగనా రౌనత్ ఫోస్ట్

  • Published Jul 24, 2024 | 5:54 PM Updated Updated Jul 24, 2024 | 5:57 PM

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలువురును విమర్శించి పోస్టులు చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత మూలాలున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను అక్కడ అమెరికన్లు చేస్తున్న ట్రోల్స్ పై మండిపడుతూ తనదైన స్టైల్ లో విమర్శిస్తూ పోస్టు పెట్టారు.

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలువురును విమర్శించి పోస్టులు చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత మూలాలున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను అక్కడ అమెరికన్లు చేస్తున్న ట్రోల్స్ పై మండిపడుతూ తనదైన స్టైల్ లో విమర్శిస్తూ పోస్టు పెట్టారు.

  • Published Jul 24, 2024 | 5:54 PMUpdated Jul 24, 2024 | 5:57 PM
భార‌తీయుల కంటే అమెరికన్లు అధ్వానం అంటూ.. కంగనా రౌనత్ ఫోస్ట్

బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఈమె లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బిజెపి ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పలు పార్లమెంట్ సమావేశాలకు ఎంపీగా హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే దేశంలో సామాజిక, రాజకీయ సమస్యల గురించి స్పందిస్తూ తన గళం వినిపిస్తున్నారు. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాల విషయానికొస్తే.. ఈమె ఇందిరా గాంధీ బయోఫిక్ గా తెరకెక్కనున్న ఎమర్జెన్సీలో నటించారు. కాగా, ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. ఇకపోతే ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా క్రేజ్ తెచ్చుకున్న కంగనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలువురును విమర్శించి పోస్టులు చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే నటి, ఎంపీ కంగన అమెరికన్లపై విమర్శల వర్షం కురిపించారు. పైగా అమెరికన్లు, భారతీయుల కంటే అధ్వాన్నం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే భారత మూలాలున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను అక్కడ అమెరికన్లు `హై-ఎండ్ కాల్ గర్ల్` అని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కమలా హారిస్ పై వస్తున్న ఈ ట్రోల్స్ మీమ్స్ పై తాజాగా నటి, ఎంపీ కంగనా రౌత్ స్పందించి తనదైన స్టైల్ లో అమెరికన్లకు చురకలు పెట్టారు. అంతేకాకుండా.. కమలా హారిస్ కు మద్దతుగా నిలిచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం కంగనా చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టులో సె*స్ట్ పోస్ట్‌ను క్వీన్ నిందించింది. అమెరికన్లు భారతీయుల కంటే అధ్వాన్నంగా ఉన్నారని అగ్ర‌రాజ్యంలో ఇది తిరోగమనం అని అన్నారు. ఇకపోతే ఈ వివాదం ఎలా మొదలైదంటే.. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తన పేరును ప్రెసిడెంట్ రేసు నుంచి ఉపసంహరించుకోగా.. అత‌డి స్థానంలో కమలా హారిస్‌ను అధ్య‌క్ష రేసు కోసం ఆమోదించాడు. కానీ, అప్పటి నుంచి సోషల్ మీడియాలో కమలా హారిస్ పై తప్పుడు ప్రచారాలతో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఈ విమర్శలపై స్పందించిన కంగనా.. ఆమె కూడా ఆ సంచలన పోస్ట్‌ను షేర్ చేసి.. ‘ప్రజాస్వామ్యవాదులకు తాను మద్దతు కానప్పటికీ, హారిస్ పై ఎంత ద్వేషం ఉందో  అర్థం చేసుకోలేక‌పోయానని కంగ‌న‌ పేర్కొంది. అమెరికాలో ఒక మహిళా రాజకీయవేత్త ఇంత దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కోవలసి రావడం చాలా నీచంగా ఉందంటూ కంగనా తన పోస్టులో రాసుకొచ్చారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ అమెరికన్లు తాము చాలా అభివృద్ధి చెందామని అనుకుంటున్నారు. కానీ వారు తిరోగమనశీలంగా, అధ్వాన స్థితిలో ఉన్నారంటూ’ వారిపై కంగనా విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.