iDreamPost

గెలిచి చూపించిన టాలీవుడ్ హీరోయిన్.. లగేజ్ సర్దుకోమంటూ ప్రత్యర్థులకు కౌంటర్!

  • Published Jun 04, 2024 | 7:21 PMUpdated Jun 04, 2024 | 7:21 PM

నీకెందుకు రాజకీయాలంటూ ఆమెను ఎగతాళి చేశారు. గెలుపు కాదు కదా.. డిపాజిట్లు కూడా దక్కవంటూ హేళన చేశారు. కానీ ఆ టాలీవుడ్ హీరోయిన్ సాధించి చూపించింది.

నీకెందుకు రాజకీయాలంటూ ఆమెను ఎగతాళి చేశారు. గెలుపు కాదు కదా.. డిపాజిట్లు కూడా దక్కవంటూ హేళన చేశారు. కానీ ఆ టాలీవుడ్ హీరోయిన్ సాధించి చూపించింది.

  • Published Jun 04, 2024 | 7:21 PMUpdated Jun 04, 2024 | 7:21 PM
గెలిచి చూపించిన టాలీవుడ్ హీరోయిన్.. లగేజ్ సర్దుకోమంటూ ప్రత్యర్థులకు కౌంటర్!

స్టార్ హీరోయిన్​గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె హవా నడుస్తోంది. హీరోతో సంబంధం లేకుండా ఆమెనే సోలో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంది. లేడీ ఒరియంటెడ్ మూవీస్​తో స్టార్ హీరో మూవీస్​కు దీటుగా కలెక్షన్స్ రాబట్టింది. కెరీర్ పీక్​లో ఉన్న దశలో అనూహ్యంగా రాజకీయాల వైపు ఆమె టర్న్ తీసుకుంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయింది. లోక్​సభ ఎన్నికలు-2024లో పోటీ చేసింది. దీంతో నీకెందుకు రాజకీయాలంటూ ఆమెను విపక్ష నేతలు ఎగతాళి చేశారు. గెలుపు కాదు కదా.. డిపాజిట్లు కూడా దక్కవంటూ హేళన చేశారు. కానీ ఆ టాలీవుడ్ హీరోయిన్ సాధించి చూపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించింది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గెలిచి చూపించింది. హిమాచల్ ప్రదేశ్​లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. 71 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్​ను చిత్తుగా ఓడించింది. ఎంపీగా పోటీ చేసిన తొలి ఎలక్షన్​లోనే కంగనా గెలవడంతో ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు. విజయం తర్వాత ఈ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మండి నుంచి తాను ఓడిపోతానని ఎద్దేవా చేశారని, తిరిగి ముంబై వెళ్లిపోవడం ఖాయమంటూ విమర్శించారని ఆమె గుర్తుచేసింది. మహిళల్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల కలిగే పరిణామాల్ని కచ్చితంగా చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. తమ బిడ్డను అవమానిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని.. కాంగ్రెస్ లీడర్ తన లగేజ్​ను సర్దుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని కంగనా కౌంటర్ ఇచ్చింది.

సామాన్లు సర్దుకొని వెళ్లిపోండి అంటూ ప్రత్యర్థి నేత విక్రమాదిత్యను ఉద్దేశిస్తూ కంగనా వ్యాఖ్యానించింది. కంగన విజయాన్ని ఆమె ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమె అనుకున్నది సాధించిందంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సినిమాల్లోలాగే రాజకీయాల్లోనూ ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. కంగనను సినీ, రాజకీయ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఇక, హిందీలో టాప్ రేంజ్​కు చేరుకున్న కంగన.. కెరీర్ మొదట్లో టాలీవుడ్​లోనూ ఓ సినిమాలో యాక్ట్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో ఆమె నటించింది. క్యూట్ యాక్టింగ్​తో ఇక్కడి వారి మనసులు గెలుచుకుంది. మరి.. కంగన ఎంపీగా కూడా సక్సెస్ అవుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి