iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం!

  • Published Nov 09, 2024 | 5:02 PM Updated Updated Nov 09, 2024 | 5:02 PM

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోొ వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌౌత్ ఇంట విషాదం నెలకొంది.

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోొ వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌౌత్ ఇంట విషాదం నెలకొంది.

ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం!

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. హార్ట్ ఎటాక్, వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు  అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారని ఇన్‌స్ట్రా వేధికగా తెలిపింది కంగనా.  పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు కంగనా. మొదటి కథనంలో తన అమ్మమ్మతో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ‘నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ జీ కన్నుమూశారు. కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. దయచేసి ఆమె కోసం ప్రార్ధించండి’అంటూ ఇన్‌స్ట్రా‌లో రాసుకొచ్చింది. రెండో కథనంలో అమ్మమ్మతో కలిసి ఉన్న మరో ఫోటో పంచుకుంటూ..‘అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు ఐదుగురు సంతానం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. పిల్లలు ఉన్న విద్యావంతులు కావడానికి అహర్శిశలూ కష్టపడింది. పెళ్లయిన తర్వాత తన కుమార్తెలు పని చేయాలని వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని ఆమె సూచించేవారు. కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అప్పట్లో అదో గొప్ప విజయంగా భావించేవారు. ఆడవారితో సహా ఆమె 5 మంది పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఆమె తన పిల్లల కెరీర్ గురించి, వారు సాధించిన విజయాల గురించి ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేవారు’ అని రాసుకొచ్చింది. తన అమ్మమ్మ వయసు ఇప్పుడు 100 ఏళ్లు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూసినట్లు నటి కంగనా తెలిపింది.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఓ వైపు రాజకీయల్లో చురుగ్గా పాల్గొంటూనే సినిమాల్లో కొనసాగుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో కంగనా వార్తల్లో నిలుస్తుంటారు. ఆ మధ్య రైతు సంఘాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై విపక్షాలతో పాటు రైతు సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు స్థానిక పార్టీలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరింది. నటిగానే కాకుండా దర్శకురాలు, నిర్మాతగా వ్యవహరిస్తుంది కంగనా. ప్రస్తుతం కంగాన రౌనత్ స్వియ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ బోర్డు వల్ల వాయిదా పడింది. ఈ సినిమా టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. 2006 థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్‌లో మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2020లో రనౌత్ తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్‌ని ప్రారంభించింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలువురు దర్శక, నిర్మాత, హీరోలపై సంచలన కామెంట్స్ చేసింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారం రేపాయి. కంగనా రౌనత్ అమ్మమ్మ మృతిపై పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు నివాళులర్పించారు.