iDreamPost

15 ఏళ్లకే ఇంటి నుంచి పరార్‌! నిన్న ఫలితాల్లో MPగా రికార్డు! ఈ నటి ఎవరంటే?

  • Published Jun 05, 2024 | 3:11 PMUpdated Jun 05, 2024 | 3:11 PM

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ యువతిని గుర్తు పట్టారా.. ఆమె సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా రాణించింది. ఇప్పుడు ఎంపీగా రికార్డ్‌ సృష్టించింది. ఆ నటి ఎవరంటే..

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ యువతిని గుర్తు పట్టారా.. ఆమె సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా రాణించింది. ఇప్పుడు ఎంపీగా రికార్డ్‌ సృష్టించింది. ఆ నటి ఎవరంటే..

  • Published Jun 05, 2024 | 3:11 PMUpdated Jun 05, 2024 | 3:11 PM
15 ఏళ్లకే ఇంటి నుంచి పరార్‌! నిన్న ఫలితాల్లో MPగా రికార్డు! ఈ నటి ఎవరంటే?

రాజకీయాలు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో రాణించిన వారు చాలా మంది.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి విజయాలు సాధిస్తున్నారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు ఏకంగా ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇప్పటికి కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రతి సారి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ ప్రముఖులు రాజకీయ కదనరంగంలోకి దిగి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు విజయం సాధిస్తే.. మరి కొందరు ఓటమి పాలవుతారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా పలువురు సెలబ్రిటీలు బరిలో దిగారు. వీరిలో ఓ లేడీ సూపర్‌ స్టార్‌ కూడా ఉన్నారు. ఆమె భారీ మెజార్టీతో ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పైన ఫొటోలోని చిన్నారి తనే. ఇంతకు ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా.. లేదా.. అయితే పదండి మేమే చెబుతాం.

పైన ఫొటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తోన్న చిన్నారిని చూశారా.. తను ఇప్పుడు ఎలా మారిందో తెలుసా.. ఫైర్‌ బ్రాండ్‌.. సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌. బాలీవుడ్‌ మాఫియాను ఎదిరించి నిలిచిన ఒకే ఒక్క హీరోయిన్‌.. తనే కంగనా రనౌత్‌. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె భారీ విజయం సాధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమె మీద కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌, సిట్టింగ్‌ ఎంపీ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేయగా.. ఆమె భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ తారలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇక కంగనా గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. చిన్నప్పటి నుంచే ఆమెకు సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. అందుకే చదువును సగంలోనే వదిలేసి.. 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది. ప్రారంభంలో ఉండేందుకు తావు లేకపోతే.. ప్లాట్‌ఫాంపై నివాసం ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. అయినా సినిమా ప్రయత్నాలు ఆపలేదు. అలా ఆమె 19వ ఏట తొలి అవకాశం లభించింది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కంగనా నటించిన ఫ్యాషన్‌ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు గాను ఆమె జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ప్రస్తుతం హీరోయిన్‌ సెంట్రిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్డగా నిలిచింది కంగనా. హీరోయిన్‌గా మాత్రమే కాక.. దర్శకురాలిగా కూడా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె డైరెక్షన్‌లో వస్తోన్న ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది కంగనా. ఇక ఇప్పుడు తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తన స్వగ్రామం మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి.. విజయం సాధించి.. ఇప్పుడు పార్లమెంట్‌లోకి ప్రవేశిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి