iDreamPost
android-app
ios-app

ఈ ఎంపీలిద్దరూ.. ఓ సినిమాలో కలిసి నటించారు.. ఎవరో తెలుసా?

Kangana Ranaut, Chirag Paswan: ఎంతో మంది నటీనటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా చాలా మంది సినీ రంగానికి చెందిన వారు  రాజకీయాలోకి వస్తున్నారు. తాజాగా అలా వచ్చిన ఓ ఇద్దరు ఓ ఎంపీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో వైరల్ అవుతోంది.

Kangana Ranaut, Chirag Paswan: ఎంతో మంది నటీనటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా చాలా మంది సినీ రంగానికి చెందిన వారు  రాజకీయాలోకి వస్తున్నారు. తాజాగా అలా వచ్చిన ఓ ఇద్దరు ఓ ఎంపీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో వైరల్ అవుతోంది.

ఈ ఎంపీలిద్దరూ.. ఓ సినిమాలో కలిసి నటించారు.. ఎవరో తెలుసా?

సినీ, రాజకీయ రంగానికి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే.. ఇక్కడ రెండు రంగాల్లో ఉండే పోలిక విషయంలో కాదు. సినిమా రంగానికి చెందిన ఎంతో మంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా చాలా మంది సినీ రంగానికి చెందిన వారు  రాజకీయాలోకి వస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా పలువురు తారలు పార్లమెంట్ లో మెరిశారు. అలాంటి గెల్చిన ఓ ఇద్దరు ఎంపీలకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరు కలిసి ఒకప్పుడు సినిమాలో నటించారు. ఇంతకీ వారు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఎన్టీయే కూటమికి ఊహించిన ఫలితాలు దక్కపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం లభిచింది. మొత్తంగా ఈ విజయంతో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇది ఇలా ఉంటే.. ఈ సారి కొత్తగా కొంతమంది యువ నాయకులు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం వైరల్ గా మారింది. వారిద్దరే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, అలానే  లోక్ జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాసవాన్. కంగనా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలానే ఎన్డీయే కూటమిలో ఉన్న లోక్ జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాసవాన్ బీహార్ లోని హాజిపూర్ స్థానం నుంచి గెలుపొందారు.

అయితే వీరిద్దరు ఇప్పుడు అంటే పార్లమెంట్ సభ్యులే కానీ, ఒకప్పుడు మాత్రం కలిసి  సినిమాలో నటించారు. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్‌’ చిత్రంలో ఈ జోడీ కలిసి పని చేశారు. ఆ సినిమాలు హీరోహీరోయిన్లు గా నటించారు. అప్పట్లో నటనపై చిరాగ్‌ కి ఆసక్తి ఉండేది. అందుకే 2011 మిలే నా మిలే హమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రాజకీయాల్లోకి వచ్చి తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగన బాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్నారు. అలాంటి వీరిద్దరు ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్‌సభలో అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన 11 ఏళ్ల నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా వీరిద్దరు కలిసి 13 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌లో కనిపించబోతున్నారు.