iDreamPost
android-app
ios-app

రాజస్థాన్ జట్టుకు గుడ్ బై చెప్పడానికి కారణం చెప్పిన శాంసన్

  • Published Mar 18, 2026 | 10:52 AM Updated Updated Mar 18, 2026 | 10:52 AM

ఐపీఎల్ లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు శాంసన్.. తొలి మ్యాచ్ లోనే తన మాజీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐపీఎల్ లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు శాంసన్.. తొలి మ్యాచ్ లోనే తన మాజీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది.

  • Published Mar 18, 2026 | 10:52 AMUpdated Mar 18, 2026 | 10:52 AM
రాజస్థాన్ జట్టుకు గుడ్ బై చెప్పడానికి కారణం చెప్పిన శాంసన్

11 సీజన్ లు గా ఒకే జట్టుకు ఆడిన చరిత్ర.. కెప్టెన్ గాను నాలుగేళ్లు జట్టును నడిపించాడు.. ఫ్రాంచైజీతో గొడవలు పెట్టుకునేవాడు కూడా కాదు.. జట్టును 2022లో ఫైనల్ కు చేర్చాడు. ఇక బ్యాటర్ గా జట్టు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్ లు. ఇలాంటి సమయంలో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రేడింగ్ ద్వారా ఎందుకు వెళ్ళాడో ఇప్పటికీ మిస్టరీనే. అసలు రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సక్సెస్ ఫుల్ ప్లేయర్ సంజు శాంసన్ ను ఎందుకు వద్దనుకుంది..? లేకపోతే శాంసన్ రాయల్స్ జట్టులో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించలేదా..? 11 సీజన్ లు గా ఒకే ఫ్రాంచైజీకి ఆడిన శాంసన్ సడన్ గా చెన్నై కి వెళ్ళడానికి కారణం ఏంటి..? ఈ విషయాలన్నిటికీ శాంసన్ క్లారిటీ ఇచ్చేశాడు.

ఐపీఎల్ లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు శాంసన్.. తొలి మ్యాచ్ లోనే తన మాజీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి 30న గౌహతి వేదికాగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో శాంసన్ ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ పోరుకు ముందు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ఎందుకు బయటకి వచ్చాడో చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ జట్టుతో నా సమయం ముగిసిపోయిందని గ్రహించి నేను రాజస్థాన్ రాయల్స్‌ను విడిచిపెట్టానని చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ తో తొలి మ్యాచ్ లో ఆడినా నేను ఎలాంటి ఎమోషన్ కు గురి కాకుండా చూసుకుంటా అని సంజు తెలిపాడు. రాజస్థాన్ పై అయినా నా అత్యుత్తమ ఆటను ఆడతానని శాంసన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. శాంసన్ మాటలను చూస్తుంటే జట్టుతో ఎలాంటి విబేధాలు లేకుండా తనంతట తాను ఫ్రాంచైజీని వద్దనుకుని జట్టును వదిలేశాడని స్ఫష్టమవుతోంది. ఇదిలా ఉంటే CSK లెజండరీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాది కూడా ఇదే పరిస్థితి. 12 సీజన్ లు చెన్నై జట్టు తరపున ఆడిన జడేజా 17 ఏళ్ళ తర్వాత రాజస్థాన్ జట్టులోకి రావడం విశేషం. గతంలో జడేజా 2008, 2009 సీజన్ లలో రాజస్థాన్ జట్టు తరపున ఆడడం విశేషం.

ఇక సంజు శాంసన్ విషయానికి ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 2013లో తొలిసారి ఆడాడు. తొలి సీజన్ లోనే అదరగొట్టిన శాంసన్ ఆ సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. మూడేళ్ళ పాటు రాజస్థాన్ తో కొనసాగిన సంజు 2016, 2017 లో ఢిల్లీ జట్టుకు ఆడాడు. 2018లో రాజస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చిన శాంసన్ కీలక ప్లేయర్ గ ఎదిగాడు. శాంసన్ నిలకడగా రాణించడంతో రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చింది. 2021లో తొలిసారి రాజస్థాన్ కెప్టెన్సీ చేపట్టిన శాంసన్.. 2022లో జట్టుకు ఫైనల్ కు తీసుకు వెళ్లినా టైటిల్ అందించలేకపోయాడు. 2023లో ప్లే ఆఫ్స్ కు చేర్చినా.. 2024, 2025లో శాంసన్ సారధ్యంలో రాజస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. దీంతో శాంసన్ కెప్టెన్సీపై ఫ్రాంచైజీ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇది గ్రహించిన ఈ స్టార్ బ్యాటర్ సైలెంట్ గా జట్టు నుంచి తప్పుకున్నాడు.

ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో దంచికొట్టిన శాంసన్ ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో ఓవరాల్ గా 5 మ్యాచ్ ల్లోనే 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ గెలుచుకొని అదే ఫామ్ ను ఐపీఎల్ లో కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెన్నై ఫ్యాన్స్ కూడా శాంసన్ ఎంట్రీతో ఖుషీగా ఉన్నారు. ఇన్ని అంచనాల మధ్య శాంసన్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş