iDreamPost

Kangana Ranaut: కంగనాను కొట్టిన మహిళా ఉద్యోగికి బంగారం గిఫ్ట్‌

  • Published Jun 09, 2024 | 11:45 AMUpdated Jun 09, 2024 | 11:45 AM

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, నూతనంగా ఎంపీగా ఎంపికైన కంగనా రనౌత్‌ను.. ఓ మహిళా ఉద్యోగిని చెంప దెబ్బ కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సదరు ఉద్యోగికి మద్దతు పెరుగుతోంది. ఆ వివరాలు..

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, నూతనంగా ఎంపీగా ఎంపికైన కంగనా రనౌత్‌ను.. ఓ మహిళా ఉద్యోగిని చెంప దెబ్బ కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సదరు ఉద్యోగికి మద్దతు పెరుగుతోంది. ఆ వివరాలు..

  • Published Jun 09, 2024 | 11:45 AMUpdated Jun 09, 2024 | 11:45 AM
Kangana Ranaut: కంగనాను కొట్టిన మహిళా ఉద్యోగికి బంగారం గిఫ్ట్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించి.. పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న కంగనా రనౌత్‌కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో ఓ మహిళా ఉద్యోగిని కంగనా చెంప పగలకొట్టి.. వార్తల్లో నిలిచింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను కొందరు తప్పు పడుతుండగా.. చాలా మంది సదరు ఉద్యోగినిని సపోర్ట్‌ చేస్తున్నారు. ఆమె చేసింది 100 శాతం కరెక్ట్‌ అంటున్నారు. కొందరు సెలబ్రిటీలు.. డైరెక్ట్‌గానే సదరు ఉద్యోగినికి మద్దతిస్తున్నారు. ఆమెకు జాబ్‌ ఆఫర్‌ చేయగా.. ఇక తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. సదరు ఉద్యోగినికి బంగారం గిఫ్ట్‌గా పంపారు. ఆ వివరాలు..

బాలీవుడ్ నటి, ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఢిల్లీ వెళ్లడం కోసం.. ఛండీగఢ్ విమానాశ్రయం వెళ్లగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఎస్ఎస్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ హీరోయిన్‌ చెంప చెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎంపీని కొట్టినందుకు హరియానా ప్రభుత్వం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కానీ పంజాబ్‌ రైతులు మాత్రం కుల్విందర్‌ కౌర్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా, తమిళనాడుకు చెందిన పెరియార్ అభిమాన సంఘం.. ఆమెకు బంగారు ఉంగరం బహుమతిగా పంపాలని నిర్ణయించింది. కోయంబత్తూరులోని తంథై పెరియార్ ద్రావిడర్ కజగం (టీపీడీకే) 8 గ్రాముల బంగారు ఉంగరం కానుకగా పంపుతామని ప్రకటించింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా టీపీడీకే జనరల్ సెక్రెటరీ కొవాయ్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమం చేస్తోన్న రైతులను అవమానించిన కంగనా రనౌత్‌ను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్‌ను అభిమానిస్తున్నాను. ఈ సందర్భంగా ఆమెకు 8 గ్రాముల బంగారం ఉంగరం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. పేరియార్ బొమ్మ ఉన్న ఉంగరాన్ని సోమవారం నాడు కుల్విందర్‌ ఇంటికి పంపుతాం.. కొరియర్‌లో ఆమె ఇంటి చిరునామాకు పంపుతాం. ఒకవేళ ఉంగరాన్ని కొరియర్‌లో పంపడం కుదరంటే.. మా ప్రతినిధి రైల్లో లేదా విమానంలో కుల్విందర్‌ ఇంటికి వెళ్లి.. బంగారు ఉంగరంతో పాటు పెరియార్ పుస్తకాలను అందజేస్తారు’’అని చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతుగా నిలిచిన కుల్విందర్ ధైర్యవంతురాలని ఆయన ప్రశంసించారు.

ఈ ఘటనపై కుల్విందర్‌ స్పందిస్తూ.. తాను చేసింది మంచి పనే అని సమర్ధించుకుంది. తాను కంగనాను కొట్టడానికి గల కారణాలను వివరించింది. మూడేళ్ల కిందట సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని ఆమె కించపరస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని కుల్విందర్‌ చెప్పుకొచ్చింది. ఈ ఉద్యమంలో తన తల్లి కూడా పాల్గొన్నదని కుల్విందర్‌ చెప్పుకొచ్చింది. రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ అప్పట్లో కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడంతోనే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కౌర్ వెల్లడించింది. ఈ ఘటనలో ఆమెను అధికారులు సస్పెండ్ చేసి.. ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో కుల్వీందర్ కౌర్‌కు అన్యాయం జరగకూడదని.. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి