iDreamPost
android-app
ios-app

ఖరీదైన కారు కొన్న కంగనా రనౌత్.. ఎన్ని కోట్లంటే?

  • Published Apr 08, 2024 | 7:44 PM Updated Updated Apr 08, 2024 | 8:59 PM

Kangana Ranaut New Car: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కొత్త కారు కొనుగోలు చేసింది. ఇది వరల్డ్ వైడ్ గా ఉండే అత్యంత లగ్జరీ కార్లలో ఒకటి కావడం విశేషం.

Kangana Ranaut New Car: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కొత్త కారు కొనుగోలు చేసింది. ఇది వరల్డ్ వైడ్ గా ఉండే అత్యంత లగ్జరీ కార్లలో ఒకటి కావడం విశేషం.

  • Published Apr 08, 2024 | 7:44 PMUpdated Apr 08, 2024 | 8:59 PM
ఖరీదైన కారు కొన్న కంగనా రనౌత్.. ఎన్ని కోట్లంటే?

కంగనా రనౌత్.. ఈ స్టార్ హీరోయిన్ గురించి పాన్ ఇండియా అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాబోయో లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కావడంతో అటు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యారనే చెప్పాలి. అటు సినిమా, ఇటు రాజకీయాలు కాకుండా ప్రస్తుతం కంగనా రనౌత్ మరో విషయంలో వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆమె ఒక ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. అందరూ కంగనా కొనిన కారు ధర ఎన్ని కోట్లా? అని వెతుకులాట మొదలు పెట్టారు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దాదాపుగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాను ఏది అనుకుంటే అది ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆవిడ. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కంగనా రనౌత్ లగ్జరీ కారు కొనుగోలు చేయడంతో వార్తల్లో నిలిచారు ఆమె తాజాగా మెర్సిడీజ్ బెంజ్ మే బ్యాక్ జీఎల్ఎస్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారుని తన మణికర్ణిక ప్రొడక్షన్స్ పేరు మీద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత దీని విలువ విషయానికి వస్తే..ఈ కారు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇది వరల్డ్ వైడ్ గా ఉన్న అత్యంత లగ్జరీ కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కంగనా రనౌత్ గ్యారేజీలో 3 అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడుగా మరో అత్యంత లగ్జరీ కారు వచ్చి చేరింది.

కంగనా రనౌత్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఎన్నో డేరింగ్ స్టెప్స్ తీసుకుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ జరిగే దారుణాల గురించి మీడియా ఎదుట ఎండగడుతూ ఉంటుంది. బీ టౌన్ లో ఈ డేరింగ్ లేడీ అంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే వారి గుట్టులన్నీ రట్టు చేస్తూ ఉంటుంది. అలాగే బాలీవుడ్ లో ఉండే నెపోటిజం గురించి కూడా ఈమె చాలాసార్లు కామెంట్స్ చేసింది. ముఖ్యంగా బడా బడా నిర్మాతలు, వారి జీవితాల గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుటుంది. ఇంక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంగనా రనౌత్ ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతోంది. ఇకపై సినిమాలు చేస్తుందో లేదో అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, గెలిస్తే మాత్రం చాలా అరుదుగా సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి.. కంగనా రనౌత్ ఖరీదైన కారు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş