iDreamPost
android-app
ios-app

జయా బచ్చన్ పేరు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన కంగనా!

Kangana Ranaut Comment On Jaya Bachchan: కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ వేదికగా జయా బచ్చన్ తన పేరు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అది చిన్న పాటి వివాదంగా నిలిచింది. ఆ పేరు వివాదంపై తాజాగా ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kangana Ranaut Comment On Jaya Bachchan: కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ వేదికగా జయా బచ్చన్ తన పేరు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అది చిన్న పాటి వివాదంగా నిలిచింది. ఆ పేరు వివాదంపై తాజాగా ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జయా బచ్చన్ పేరు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన కంగనా!

ఇటీవల పార్లమెంట్ లో జయా బచ్చన్ పేరుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యసభలో ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌.. ఎంపీ జయా బచ్చన్‌ను.. ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని సంబోధించారు. దీనిపై జయా బచ్చన్‌ అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా అభ్యంతరం కూడా తెలిపారు. తనను ‘జయా బచ్చన్‌ అంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ ఆ రోజు ఒకింత అసహనం వ్యక్తంచేశారు. తాజాగా ఈ ఇష్యును ఉద్దేశంచి లోక్ సభ సభ్యురాలు, సినీ నటి  కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా  ఎంపీ కంగనా రనౌత్  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జయబచ్చన్ ఇష్యూ గురించి రాగా..తనదైన విధంగా ఈమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా చిన్న విషయమన్నారు. జయా బచ్చన్ స్పందించిన తీరు కంగనా తప్పుబట్టారు. ఆడ, మగ కలిస్తేనే ఒక జీవితం ఎంతో అందంగా ఉంటుందని ఆమె హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందని చెప్పుకొచ్చారు. ఇది చాలా దారుణమైన విషయమని, స్త్రీ, పురుషుల మధ్య అందమైన బేధాన్ని ప్రకృతినే సృష్టించిందని తెలిపింది. అయితే దానిని కూడా కొందరు వివక్షగా చూస్తున్నారని, స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుందని కంగనా తెలిపారు. రాజ్యసభ వేదికగా పేరు విషయంలో నెలకొన్న వివాదం చాలా చిన్న విషయంమని కంగన తెలిపారు.

జయాబచ్చన్ వైఖరిని కూడా కంగనా తప్పబట్టారు. పేరు విషయంలో ఆ రకమైన అహంకార వైఖరి ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. మనుషులెప్పుడూ ఒకరికొకరు కలిసిఉండాలని, ఇలాంటి  ప్రవర్తన అనేది వారిని విడదీయకూడదని తెలిపింది. మన పేరు వెనక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినంతనే కొంతమంది కోపానికి గురవుతున్నారని, తీవ్ర అసహనంకి లోనవుతున్నారని పేర్కొంది. మరో వ్యక్తి పేరును చేర్చినంతమాత్రానికే తమ గుర్తింపుపోతుందని ఆందోళన చెందుతున్నారని, అలాంటి వ్యక్తులను చూసినప్పుడు బాధగా ఉంటుందని వ్యంగ్యంగా పేర్కొంది.

ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాతో బిజీగా ఉంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో కంగనా రనౌత్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.  ఇందిరాగాంధీ పొలిటికల్ లైఫ్, ఎమర్జెన్సీ నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపై కాంగ్రెస్ నేతలు విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తంగా  జయా బచ్చన్ ను  ఉద్దేశిస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.