iDreamPost
android-app
ios-app

రోహిత్ కు షాక్ ఇచ్చిన కోహ్లీ.. టీ20 బెస్ట్ ఓపెనర్ ఎవరో చెప్పిన విరాట్

  • Published Mar 18, 2026 | 12:29 PM Updated Updated Mar 18, 2026 | 12:40 PM

ఆదివారం సరదాగా సాగిన రాపిడ్ ఫైర్ లో కోహ్లీని బెస్ట్ టీ20 ఓపెనర్ ను ఎంచుకోమని అడిగారు. RCB షేర్ చేసిన ఈ వీడియోలో.. మొదట టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ఓపెనర్ ఎవరంటూ సునీల్ నరైన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ పేర్లను చెప్పారు.

ఆదివారం సరదాగా సాగిన రాపిడ్ ఫైర్ లో కోహ్లీని బెస్ట్ టీ20 ఓపెనర్ ను ఎంచుకోమని అడిగారు. RCB షేర్ చేసిన ఈ వీడియోలో.. మొదట టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ఓపెనర్ ఎవరంటూ సునీల్ నరైన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ పేర్లను చెప్పారు.

  • Published Mar 18, 2026 | 12:29 PMUpdated Mar 18, 2026 | 12:40 PM
రోహిత్ కు షాక్ ఇచ్చిన కోహ్లీ.. టీ20 బెస్ట్ ఓపెనర్ ఎవరో చెప్పిన విరాట్

టీ20 క్రికెట్ లో బెస్ట్ ఓపెనర్ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. రెండు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న టీ20 ఫార్మాట్ లో ఎంతో మంది ఓపెనర్లు తమదైన ముద్ర వేశారు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఆడమ్ గిల్ క్రిస్ట్, ట్రావిస్ హెడ్, బ్రెండన్ మెక్కలం, క్రిస్ గేల్, ఫాఫ్ డుప్లెసిస్, జోస్ బట్లర్ లాంటి ప్లేయర్స్ పొట్టి ఫార్మాట్ లో ఓపెనర్లుగా వచ్చి దుమ్మురేపిన చరిత్ర ఉంది. వీరిలో ఒక బెస్ట్ ఓపెనర్ ను ఎంచుకోమంటే అదొక బిగ్ ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎదురయితే ఎలా ఉంటుంది..? కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్ గా ఎవరిని ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

ఆదివారం సరదాగా సాగిన రాపిడ్ ఫైర్ లో కోహ్లీని బెస్ట్ టీ20 ఓపెనర్ ను ఎంచుకోమని అడిగారు. RCB షేర్ చేసిన ఈ వీడియోలో.. మొదట టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ఓపెనర్ ఎవరంటూ సునీల్ నరైన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ పేర్లను చెప్పారు. దీనికి కోహ్లీ ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌ పేరు చెప్పాడు. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్, ట్రావిస్ హెడ్ లలో ఎవరని అడిగితే హెడ్ కే కోహ్లీ ఓటేశాడు. ఇక హెడ్ తో పాటు టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరును ముందుంచితే కోహ్లీ కొంచెం సేపు ఆలోచించి సెహ్వాగ్ అని తన మనసులో మాట చెప్పాడు. ఇక సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ లలో బెస్ట్ ఎవరని అడిగితే టీ20 ఫార్మాట్ లో అయితే ఖచ్చితంగా సెహ్వాగ్ అని కోహ్లీ మరో ఆలోచన లేకుండా చెప్పాడు.

ఆ తర్వాత ఈ జరిగిన ఈ రాపిడ్ ఫైర్ లో శిఖర్ ధావన్, బ్రెండన్ మెక్కలం, ఫాఫ్ డుప్లెసిస్ ల కంటే సెహ్వాగ్ బెస్ట్ అని విరాట్ అన్నాడు. అయితే సెహ్వాగ్, క్రిస్ గేల్ లో ఎవరు బెస్ట్ అని అడిగితే కోహ్లీ గేల్ కే ఓటేశాడు. ఇక చివరిగా గేల్, రోహిత్ శర్మలలో ఎవరు టీ20 బెస్ట్ ఓపెనర్ అనే ప్రశ్న ఎదురు కాగా.. కోహ్లీ ఎలాంటి టైమ్ తీసుకోకుండా గేల్ పేరునే చెప్పాడు. దీంతో కోహ్లీతో జరిగిన రాపిడ్ ఫైర్ లో బెస్ట్ టీ20 ఓపెనర్ గా గేల్ నిలిచాడు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ రాపిడ్ ఫైర్ లో సచిన్, రోహిత్, శిఖర్ ధావన్, సెహ్వాగ్ లాంటి ప్లేయర్లను కాదని గేల్ ను బెస్ట్ టీ20 ఓపెనర్ గా కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ చెప్పిన ఈ సమాధానంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గేల్ టీ20 క్రికెట్ లో ఇప్పటికే శిఖరాన ఉన్నాడు.

టీ20 చరిత్రలో గేల్ ఓవరాల్ గా 455 ఇన్నింగ్స్‌లలో 14,562 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 142 మ్యాచ్‌లు ఆడిన ఈ వెస్టిండీస్ లెజండ్ 4,965 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో వరుసగా రెండు సీజన్ లలో గేల్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలవడంతో పాటు ఈ మెగా లీగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డ్ కూడా గేల్ పేరిట ఉండడం విశేషం. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే గేల్, కోహ్లీ ఇద్దరూ కూడా గతంలో RCB తరపున ఆడారు. ఆ సమయంలో కోహ్లీ గేల్ బ్యాటింగ్ దగ్గరుండి చూశాడు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఐపీఎల్ లో చాలా ఏళ్ళు చక్కటి అనుబంధం ఉంది. గేల్ ఇప్పటికే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ తమ టీ20 కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetmarsbahis giriştaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet