iDreamPost
android-app
ios-app

Emergency Movie: తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. కంగనా ఎమర్జెన్సీ మూవీ బ్యాన్‌ ?

  • Published Aug 30, 2024 | 2:59 PM Updated Updated Aug 30, 2024 | 2:59 PM

Is TG Govt Ban Kangana Ranaut Emergency Movie: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంనగా రనౌత్‌ నటించిన సినిమా ఎమ్జన్సీ. త్వరలోనే విడుదల కానున్నీ సినిమాకు తెలంగాణ సర్కార్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

Is TG Govt Ban Kangana Ranaut Emergency Movie: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంనగా రనౌత్‌ నటించిన సినిమా ఎమ్జన్సీ. త్వరలోనే విడుదల కానున్నీ సినిమాకు తెలంగాణ సర్కార్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 30, 2024 | 2:59 PMUpdated Aug 30, 2024 | 2:59 PM
Emergency Movie: తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. కంగనా ఎమర్జెన్సీ మూవీ బ్యాన్‌ ?

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం కంగనా అటు పాలిటిక్స్‌.. ఇటు సినిమాలు రెండింటిలో దూసుకుపోతున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లోనే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్‌ కంగనా రనౌత్‌కు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నట్లు సమాచారం. ఈ మూవీని తెలంగాణలో విడుదల చేయకుండా నిషేధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

కంగనా రనౌత్‏ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిషేధించాలని రేవంత్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‏ను కలిశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమా విడుదలపై నిషేధం విధించాలని వారు అభ్యర్థించినట్లు సమాచారం. కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమాలో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల సిక్కు సొసైటీ బృందం రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు.

Sensational decision of Telangana Sarkar emergency movie ban!

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. ఎమర్జెన్సీ మూవీ విడుదలపై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ వెల్లడించారు. దీనిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు షబ్బీర్ తెలిపారు. తెలంగాణ జనాభాలో సిక్కు సమాజం 2 శాతంగా ఉంది.

దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ప్రధాన కథాంశంగా కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించారు. దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించడమే కాక.. స్వయంగా ఈ మూవీకి ఆమెనే దర్శకురాలు కావడం విశేషం. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా.. కంగనా హోం బ్యానర్ మణికర్ణిక ఫిల్మ్ పతాకంపై నిర్మించారు.