సాధారణంగా సీఎం హోదాలో ఉండే వ్యక్తికి కాన్వాయ్ లు ఉంటాయి. కానీ అదే తీరులో కాన్వాయ్ లను సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 8 కాన్వాయ్ లు ఇప్పుడు జనసేన అధినేత దగ్గర హల్ చల్ చేస్తున్నాయి. వీటి కోసం సుమారు కోటిన్నర వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఎవరైనా ఒక కార్ లో వెళ్తారు. అనుచరులు, ఇతర పార్టీ సభ్యులు వెనుక ఎన్ని కార్లలో అయినా రావొచ్చు. కొన్నిసార్లు ప్రత్యేకంగా కారవాన్ వాడతారు. […]
నిన్న సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ VS అల్లు అర్జున్ అభిమానుల రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. రెండు రోజుల క్రితం విజయవాడలో మెగా ఫ్యాన్స్ మీటింగ్ ఒకటి జరిగింది. అధికారిక సంఘాల సూచనల మేరకు రెండు రాష్ట్రాల నుంచి కీలక సభ్యులు అందులో పాల్గొన్నారు. కానీ బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి అదుపు తప్పడంతో ట్విట్టర్ లో లేనిపోని రగడకు కారణమయ్యింది. అసలేం జరిగిందో చూద్దాం. అఖిల భారత చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని […]
‘ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను’ అంటూ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. దీనిపై ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. సినీనటుడిగా తనకున్న గ్లామర్‌నే ప్రధాన వనరుగా భావించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై స్పందించే తీరు కూడా సినిమాటిక్‌గానే ఉంటుంది. తాను ఏ తరహా డైలాగ్‌లు పలికితే అభిమానులు ఉర్రూతలూగిపోతారో […]
pawan party symbol: రాష్ట్రంలో జనసేన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పార్టీ ప్రారంభించిన 2014 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అధికార బీజేపీతో గట్టి సంబంధాలే ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే […]
భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న జనసేనకు తెలంగాణలో పెద్ద దెబ్బే తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు అయిన జనసేన పార్టీకి కామన్ సింబల్ గా కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ తన మొదటి ఎన్నికల్లో కచ్చితంగా 10% స్థానాల్లో పోటీ […]
భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయంటే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అంచనాలు పెరిగాయి. పవన్ చరిస్మా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గాలితో గట్టి పోటీ ఖాయమని అంతా భావించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీలూ ప్రచారంలో ఎంతలా అదరగొడతాయోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూశారు. పవన్ కల్యాణ్ ప్రజల్లో కలియతిరిగి బీజేపీ అభ్యర్థి ప్రచారానికి ఓ ఊపు తెస్తారని అటు బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది. కానీ మొత్తంగా బీజేపీ – […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు.. ప్రతి ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన గాజు గ్లాస్ గుర్తు.. ఈ సారి నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కు దక్కడం తో.. జనసేన, బిజెపి నేతలు.. అధికార పార్టీ వైసీపీ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. గుర్తుల కేటాయింపు లో వైసీపీ కుట్ర, వ్యూహం ఉందని, కేంద్ర ఎన్నికల […]
తిరుపతి ఉప ఎన్నికలు బీజేపీకి కత్తిమీద సాములా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం కన్నా.. జనసేన కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు, జనసేన మద్ధతుదారుల ఓట్లు పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జనసేన తప్పక పోటీ చేస్తుందనుకున్న స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలబడడంతో.. ఆ పార్టీ కార్యకర్తల పని చేస్తారా..? లేదా..? అనే అనుమానాలు బీజేపీ నేతలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే జనసైనికులను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు ప్రతి సమావేశంలోనూ పవన్ […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పైకి జనసేన బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి సహకరిస్తుందా..? అనే అనుమానాలు లేకపోలేదు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించకపోవడం ఈ అనుమానాన్ని బలోపేతం చేస్తోంది. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే రత్నప్రభ నామినేషన్ వేశారు. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు […]
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడినుంచి ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయనుంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా..? రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. జనసేన […]