iDreamPost
android-app
ios-app

పవన్ వల్ల USలో ఇల్లు అమ్ముకున్నా.. 10 కోట్లు అడిగారు: జనసేన మాజీ లీడర్ సుభాషిణి

  • Published Apr 30, 2024 | 7:42 PM Updated Updated Apr 30, 2024 | 7:44 PM

పవన్ కళ్యాణ్ ని నమ్మి అమెరికాలో మంచి జీతాన్ని, జీవితాన్ని వదులుకుని వచ్చామని.. కోటి 50 లక్షలు కోల్పోయానని జనసేన మాజీ నాయకురాలు చిట్టె సుభాషిణి వాపోయారు.

పవన్ కళ్యాణ్ ని నమ్మి అమెరికాలో మంచి జీతాన్ని, జీవితాన్ని వదులుకుని వచ్చామని.. కోటి 50 లక్షలు కోల్పోయానని జనసేన మాజీ నాయకురాలు చిట్టె సుభాషిణి వాపోయారు.

  • Published Apr 30, 2024 | 7:42 PMUpdated Apr 30, 2024 | 7:44 PM
పవన్ వల్ల USలో ఇల్లు అమ్ముకున్నా.. 10 కోట్లు అడిగారు: జనసేన మాజీ లీడర్ సుభాషిణి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ మాజీ నాయకురాలు చిట్టె సుభాషిణి సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ని నమ్మి కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా అని అన్నారు. అమెరికాలో మంచి జీవితాన్ని వదులుకుని వచ్చానని.. తీరా వచ్చాక తన పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. పదే పదే జీరో పాలిటిక్స్ అని చెప్పే జనసేనాని పవన్ కళ్యాణ్.. తనతో కోటి 50 లక్షలు ఖర్చు పెట్టించారని ఆమె వాపోయారు. పేరుకే జీరో పాలిటిక్స్ అని నీతులు చెబుతారని.. కానీ తనతో మాత్రం భారీగా ఖర్చు చేయించారని ఆమె ఆవేదన చెందారు. జనసేనలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. బాధలు మిగిల్చారని.. ఎదగనివ్వకుండా చేయడం పక్కన పెడితే పార్టీ వాళ్ళతో ప్రతి నిమిషం యుద్ధం చేశానని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

అమెరికాలో హ్యాపీ లైఫ్.. దేనికీ లోటు లేదని.. కానీ తన భర్త పవన్ మాయలో ఉండేవారని.. పవన్ కోసం సొంత ఊరు వెళ్దామంటే రావడానికి ఒప్పుకున్నానని అన్నారు. అమెరికాలో పది లక్షల జీతం వదులుకుని ఇంత దూరం వచ్చాము కానీ ఇక్కడేమీ లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వ్యక్తులు ఈ జనసేన పార్టీలో లేరని ఆమె వాపోయారు. జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులకి చిల్లర మనస్తత్వం అని.. అందరూ అజమాయిషీ చేసేవాళ్ళేనని అన్నారు. తానొక దళిత మహిళనని.. జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం 10 కోట్లు అడిగారని అన్నారు. పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డామని.. అందుకోసం యూఎస్ లో ఇల్లు అమ్మేశామని అన్నారు. ఇల్లు అమ్మగా 6 కోట్లు వచ్చాయని.. తన అత్తయ్య గారి దగ్గర 2 కోట్లు.. మిగతా 2 కోట్లు ఫైనాన్షియర్ దగ్గర అరేంజ్ చేసుకున్నా అని అన్నారు.

పార్టీకి డొనేషన్ అడిగితే.. 10 వేలు ఇచ్చానని.. ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పారని అన్నారు. డబ్బులు అడిగితే 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డానని అన్నారు. అయితే పార్టీ అన్నాక ఖర్చులు ఉంటాయి, లెక్కలు ఉంటాయని ఒత్తిడి చేసేసరికి రెండు కోట్లు ఇస్తా అని అన్నానని.. రెండు కోట్లకు పనవ్వదమ్మా అని పార్టీ నేతలు అన్నారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో జీరో పాలిటిక్స్ అంటారు.. కానీ గ్రౌండ్ లో జరిగేది చూస్తే డబ్బులు అడుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఫ్లెక్సీలకి 50 వేలు ఇవ్వండి అని మండల అధ్యక్షుడు గంటా కృష్ణ అడిగారని.. ఇవ్వడానికి సిద్ధపడ్డానని అన్నారు. ఎంపీటీసీతో దీని గురించి మాట్లాడితే.. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి అని అన్నారని.. దీంతో వెనక్కి తగ్గానని అన్నారు. అయితే అక్కడ నుంచి తనను తొక్కడం స్టార్ట్ చేశారని.. డబ్బులడిగితే ఇవ్వలేదని ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పార్టీని, పవన్ ని నమ్మి అమెరికాలో పది లక్షల జీతం వదులుకుని.. అక్కడ సొంత ఇల్లు అమ్మేసుకుని.. కోటి 50 లక్షలు పోగొట్టుకున్నామని చిట్టె సుభాషిణి కన్నీటి పర్యంతమయ్యారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom