iDreamPost
android-app
ios-app

Pawan Kalyan: TDP, BJPతో పొత్తు వల్ల నష్టపోయానంటూ పవన్‌ ఏడుపు!

  • Published Mar 14, 2024 | 5:32 PM Updated Updated Mar 14, 2024 | 5:32 PM

Pawan Kalyan: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్త పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తుల కోసం ఆరాటపడిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. కానీ, ఇప్పుడు మాట మార్చాడు. పొత్తుల వల్ల తాను నష్టపోయానంటూ కొత్త రాగం అందుకున్నాడు.

Pawan Kalyan: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్త పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తుల కోసం ఆరాటపడిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. కానీ, ఇప్పుడు మాట మార్చాడు. పొత్తుల వల్ల తాను నష్టపోయానంటూ కొత్త రాగం అందుకున్నాడు.

  • Published Mar 14, 2024 | 5:32 PMUpdated Mar 14, 2024 | 5:32 PM
Pawan Kalyan: TDP, BJPతో పొత్తు వల్ల నష్టపోయానంటూ పవన్‌ ఏడుపు!

పవన్‌ కళ్యాణ్‌.. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. బుర్రలో పురుగు తిరిగితే చాలు తోచింది చేసే పవన్‌.. పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టేందుకు కల్లిబోల్లి కబుర్లు చెబుతుంటాడు. 2014లో పార్టీ స్థాపించింది మొదలు.. ఇప్పటి వరకు ఎన్ని రూట్లు మార్చాడో, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడో అతనికైనా గుర్తుండకపోవచ్చు. ఏపీ రాజకీయాల్లో పొత్తులు పొత్తులు అంటూ తైతక్కలాడిన పవన్‌ కళ్యాణ్‌.. తాజాగా పొత్తు వల్ల తాను నష్టపోయానంటూ క్యాడర్‌ నుంచి సింపతి కొట్టేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొదట జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తు ఉంటుందని తొలుత ప్రకటించింది పవన్‌ కళ్యాణే. ఆ తర్వాత బీజేపీని కూడా ఈ పొత్తులో భాగస్వామి అయ్యేందుకు బతిమాలింది, ఢిల్లీలో బీజేపీ పెద్దలకు దండాలు పెట్టింది ఆయనే. తీరా పొత్తు కుదిరి సీట్ల పంపకం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు పొత్తు వల్ల తనకు నష్టం జరిగిందంటూ ముసలి కన్నీరు కారుస్తున్నాడని సొంత పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు.

ఎందుకంటే.. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే డిమాండ్‌ పార్టీ శ్రేణుల్లో అస్సలు లేదు. ఏ పార్టీకైనా క్షేత్రస్థాయి క్యాడర్‌ ముఖ్యం. అలాంటి క్యాడర్‌ పొత్తులు లేకుండా సొంతంగా పోటీ చేయాలని భావించింది. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ తెలియని పవన్‌ మాత్రం.. పార్టీ కార్యకర్తలు సూచనలు పట్టించుకోకుండా.. టీడీపీ, బీజేపీతో పొత్తుకు వెంపర్లాడాడు. పోనీ పొత్తు పెట్టుకుని మంచి సీట్లు దక్కించుకున్నాడా అంటే అదీ లేదు. ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకున్నాడు. అసలే పొత్తు ఇష్టం లేని క్యాడర్‌కు ఈ 21 సీట్లు చూసి తిక్కరేగిపోయింది. నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు అనే స్థాయికి జనసేన క్యాడర్‌ తయారైంది. అయితే.. ఎప్పటిలాగే కార్యకర్తలను మోసం చేసే అతి తెలివి ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు పొత్తు వల్ల తాను నష్టపోయానంటూ, మధ్యవర్తిత్వం వహిస్తే.. తనకే నష్టం జరిగిందంటూ కార్యకర్తలపై సింపతి కార్డ్‌ను వాడుతున్నాడు.

No support to pawan kalyan in pithaapuram

తొలుత 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాలు పొందిన పవన్‌.. పొత్తులోకి బీజేపీ ఎంటరైన తర్వాత 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలకు పరిమితం అయ్యడు. దీంతో.. ఎన్నో ఏళ్లుగా దిక్కూ మొక్కు లేని పార్టీని భుజాలపై మోస్తున్న అమాయక జనసేన కార్యకర్తలకు, కొంతమంది నేతలకు పవన్‌ తీవ్ర అన్యాయం చేశాడు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ.. సమయం, డబ్బు వృథా చేసుకున్న ఎంతో మంది జనసేన నేతలకు పవన్‌ కనీసం పోటీ చేసే అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు వారంత పవన్‌పై పీకలదాక కోపంతో ఉన్నారు. వారిని బుజ్జగింజేందుకు, పొత్తులు పొత్తులు అంటే ఎగిరిన పవన్‌.. పొత్తుతో నాకే నష్టం జరిగిదంటే తనకున్న నాలుగు ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి టీడీపీ, బీజేపీతో పొత్తు వల్ల తాను నష్టపోయానని అంటున్న పవన్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.