iDreamPost
android-app
ios-app

Asaduddin Owaisi: TDP కూటమిపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్స్! గట్టిగా ఇచ్చి పడేశాడు!

ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విపక్ష కూటమిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూటమికి భంగపాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విపక్ష కూటమిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూటమికి భంగపాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.

Asaduddin Owaisi: TDP కూటమిపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్స్! గట్టిగా ఇచ్చి పడేశాడు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడీ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ సెగ మరింత పెరగనుంది. 2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ, జనసేన,బీజేపీ కలసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగనున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నికల సమరంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇలా ఏపీ ఎన్నికల వేడీ సాగుతున్న వేళ.. ఏపీలో విపక్ష కూటమిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మూడు పార్టీల మధ్య  సీట్ల పంపకం కూడా కొల్కికి వచ్చింది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా, 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నాయి. అయితే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై, అలానే ఏపీ రాజకీయలపై హైదరాబాద్ ఎంపీ సదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాడని ఆయన అన్నారు. గతంలో నరేంద్రమోదీని టెర్రరిస్టు అన్న చంద్రబాబు.. నేడు బీజేపీతో ఎలా పొత్తులు పెట్టుకుంటారని ఓవైసీ  ప్రశ్నించారు. అప్పట్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ర్యాలీ, ధర్నాలు  చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై, ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఆందోళనలు చేశారని, అలాంటి పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారని ఆయన తెలిపారు.  బీజేపీ, టీడీపీ, జనసేనకు మైనార్టీల ఓట్లు పడవని ఆయన తెలిపారు. చంద్రబాబు కూటమికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు.

Asaduddin about TDP

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసతత్వ సవరణ చట్టంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని సీఏఏను తీసుకొచ్చిందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లపాటు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు, ఇపుడు ఎన్నికలకు ముందు అమలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మతం ఆధారంగాకాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలని ఆయన సూచించరు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ పై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన వాఖ్యలు పరోక్షంగా వైసీపీ లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మైనార్టీల వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారనే మాటలను ఓవైసీ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఏపీ పాలిటిక్స్ ఈ సారి చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను పెంచాయి.  మరి…చంద్రబాబుపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.