iDreamPost
android-app
ios-app

ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో! బాబుని BJP నమ్మలేకనేనా?

TDP Manifesto: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలు మేనిఫెస్టో విడుదలలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ప్రతిపక్ష ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

TDP Manifesto: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలు మేనిఫెస్టో విడుదలలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ప్రతిపక్ష ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో! బాబుని BJP నమ్మలేకనేనా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా నేడు ప్రతిపక్ష కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూడా ఉమ్మడి మేనిఫెస్టో-2024 విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ  సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాక బీజేపీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ కూటమి మేనిఫెస్టో విడుదల  కార్యక్రమంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో కనిపించలేదు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.  అధికార వైఎస్సార్ సీపీ  సింగిల్ గా బరిలోకి దిగుతుంటే.. ప్రతిపక్షాలైన జనసేన, టీడీపీ,  బీజేపీ ఎన్టీఏ కూటమిగా  ఎన్నికల బరిలో దిగుతున్నాయి. అయితే ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు  వారి వ్యవహరం ఉంటుంది. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు జరిగాయి. మూడు పార్టీల నేతల్లోనే అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వాళ్లు కొందరు అయితే, తమను పట్టించుకోవడం లేదని మరికొందరు మూడు పార్టీల్లో అసంతృప్తితో ఉన్నారు. అలానే చాలా సార్లు జనసేన, టీడీపీ మధ్య  ఉన్న గొడవలు బహిర్గతమయ్యాయి.

ఇలా టీడీపీ, జనసేన వ్యవహారం ఉంటే.. ఈ  రెండు పార్టీలు బీజేపీపై  అసంతృప్తితో ఉన్నట్లు  పలువురు రాజకీయ విశేష్లకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకు కారణం..సీఎం జగన్ ను టార్గెట్ గా చేసుకుని మోదీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తారని, అలానే తమకు అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ విషయంలో ఏమి స్పందచడం లేదని వాదనలు ఉన్నాయి. అందుకే గతంలో జరిగిన ఈ కూటమి సభలో ప్రధాని మోదీ ఎక్కడ సీఎం జగన్ ను విమర్శించలేదు.   అలానే సీట్ల పంపకాల, అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీకి  బీజేపీ చుక్కలు చూపించిందనే వాదన ఉంది. మొత్తంగా బీజేపీ పేరుకే కూటమిలో ఉందని పరోక్షంగా అధికార  పార్టీకి సపోర్టు చేస్తుందనే టీడీపీ నేతలే  అనుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మంగళవారం విడుదల చేయనున్న  ఎన్డీఏ మేనిఫెస్టో -2024 కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టర్ లో ప్రధాని మోదీ ఫోటో కనిపించలేదు. దీనిపై అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను విడుదల ఎన్డీఏ కూటమి విడుదల చేయనుంది. చంద్రబాబు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరగనుంది.  ఇక  ఈ కార్యక్రమంలో  ఏర్పాటు చేసిన పోస్టర్ లో ప్రధాన  మోదీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే బీజేపీ వాళ్లే బాబును నమ్మలేకా.. మేనిఫెస్టో కార్యక్రమంలో మోదీ ఫోటో లేకుండా చేశారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.