iDreamPost
android-app
ios-app

పొందిన మేలు చెప్తే ట్రోల్ చేశారు! ఈమె మరణానికి సమాధానం ఎవరు చెప్తారు?

ఐ-టీడీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమకు గిట్టని వారిపై, తమ ప్రత్యర్థిని ప్రశంసించిన వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా గీతాజంలి అనే ఓ పేదింటి మహిళ చావుకు కారణమయ్యారు.

ఐ-టీడీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమకు గిట్టని వారిపై, తమ ప్రత్యర్థిని ప్రశంసించిన వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా గీతాజంలి అనే ఓ పేదింటి మహిళ చావుకు కారణమయ్యారు.

పొందిన మేలు చెప్తే ట్రోల్ చేశారు! ఈమె మరణానికి సమాధానం ఎవరు చెప్తారు?

టీడీపీ, జనసేన రాజకీయ వేధింపులకు మరో మహిళ బలైంది. ఇప్పటికే వీరి అరాచకాలకు ఎంతో మంది తీవ్ర వేదనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వీరి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా  పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి..వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అలా టీడీపీ,జనసేన వేధింపులకు గీతాంజలి అనే పేదింటి మహిళ బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమెను ఎంత దారుణంగా ట్రోల్స్ చేశారో తెలిస్తే…కన్నీళ్లు ఆగవు. అసలు వీళ్లు మనుషులేనా అనే సందేహం రాకమానదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి(28) అనే ఓ పేదింటి మహిళ తన కుటుంబం తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఇళ్లు ఉండాలనేది గీతాంజలి కల. ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలానే ఉంది. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చాకా.. గీతాంజలి కోరిక తీరింది. ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది. ఇదే సమయంలో తనకు జరిగిన మంచి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది.  ఓ సభలో వైసీపీ  ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాజంలి వివరించింది. అలానే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది.

తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని టీడీపీ,జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు. ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు. టీడీపీ కాలకేయ  సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదటలు పెట్టారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. తీవ్ర పదజాలంతో  బూతులు తిట్టారు. అర్థరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు. ఇలా సోషల్ మీడియాలో ఐ-టీడీపీ శ్రేణులు గీతాంజలిని మానసిక వేధింపులకు గురి చేసింది. వీళ్ల ట్రోల్స్ తట్టుకోలేక రైలు కిందపడి గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది.

Who is reason behind geetanjali died

ఐటీడీపీకి చెందిన సజ్జ అజయ్ అనే వ్యక్తి ఇళ్ల పట్టా పొందిన గీతాంజలని సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ శ్రేణుల ఆన్ లైన్ వేధింపులకు ఓ పేదింటి  మహిల ప్రాణాలు పోవడమే కాకుండా ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలయ్యారు. తాను పొందిన మేలును చెప్పడమే ఆ మహిళా చేసిన తప్పా?. తనకు జరిగిన మంచిని సమాజానికి తెలియజేయడం తాను చేసిన నేరమా?. తన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న గీతాంజలి నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఎవరు. ఇలా మహిళలను, స్కూల్ పిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి.

గతంలో బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే..పసిపిల్లలు అని చూడకుండా వారిపైన ట్రోల్స్ చేశారు. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో  కూడా మహిళలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. గీతాంజలి మరణానికి ఇప్పుడు సమాధానం ఎవరు చెబుతారు..టీడీపీ,జనసేన నేతలు చెబుతారా అంటూ స్థానికులు ప్రశ్నించారు. గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.