iDreamPost
android-app
ios-app

అక్కినేని నాగార్జునని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన ఫేక్ ప్రచారం! ఇంత దారుణమా?

కుబేర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న నాగార్జునపై సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడారంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే..

కుబేర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న నాగార్జునపై సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడారంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే..

అక్కినేని నాగార్జునని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన ఫేక్ ప్రచారం! ఇంత దారుణమా?

టాలీవుడ్ అగ్ర హీరో, మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నుండి నటనను వారసత్వంగా తీసుకుని.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తనను తాను ఫ్రూవ్ చేసుకున్న నటుడు. కేవలం నటుడిగానే కాకుండా ఓ ప్రొడక్షన్ కంపెనీకి నిర్మాతగా, ఓ స్టూడియో బాధత్యలను చక్కబెడుతున్నాడు. వ్యాపార రంగంలోనూ దూసుకెళుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది నా సామి రంగాతో హిట్ అందుకున్న నాగ్.. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ మన్మధుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. దీనిపై ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగార్జునపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. సినిమాలనుద్దేశించి కాకుండా రాజకీయంగా ఆయన ఏవో వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన్ను టార్గెట్ చేస్తూ కొన్న న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారంటూ ఓ ఫేక్ న్యూస్ పుట్టుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దుతుగా మాట్లాడినట్లు ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే… ఇంతలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అండగా నిలుస్తామంటూ చెప్పినట్లు మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో వాస్తవమెంత అనేది ఆలోచిస్తున్న తరుణంలో ఆయన టీం ఫేక్ ఎలర్ట్ అంటూ ప్రకటించింది. అక్కినేని నాగార్జునపై వస్తున్న రూమర్ పూర్తిగా అవాస్తవమని. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండవలసిందిగా అందరినీ కోరుతున్నామని పేర్కొంది.

ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో స్టార్లతో క్యాంపెయిన్ చేయించుకుంటాయి పార్టీలు. సినీ సెలబ్రిటీలు ఈసారి ఎన్నికల క్యాంపెయిన్లలో పాల్గొంటూ.. అనుకూల పార్టీకి మద్దుతుగా ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునను టార్గెట్ చేశాయి.. టీడీపీ, జనసేన పార్టీలు. వైసీపీకి మద్దతు ఇస్తున్నాయని కింగ్ నాగ్‌పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. ఏనాడు పొలిటికల్ విషయాలపై స్పందిచని నాగ్ గురించి కొత్తగా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఏంటనీ, మరీ ఇంతర దారుణమా అని మండిపడుతున్నారు అతడి ఫ్యాన్స్. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ టీడీపీ, జనసేనలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. తోటి నటుడిపై, అందులోనూ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడైన నాగార్జునపై ఇటువంటి రూమర్లు తీసుకు రావడంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటివి చేస్తే గెలుపు సంగతి పక్కన పెడితే.. మీకే నష్టం జరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.