P Krishna
Nagababu Satire Tweet: ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరాంగా మారుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు చేసిన ట్విట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Nagababu Satire Tweet: ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరాంగా మారుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు చేసిన ట్విట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
P Krishna
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏన్నికల్లో అధికార పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది. మరోవైపు ప్రతిపక్ష నేతలు మాత్రం సీట్ల సర్ధుబాటు విషయంలో తర్జనభర్జన చేస్తున్నారు. ఇదే సమయంలో నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగబాబు ట్విట్ ఆంతర్యం ఏంటా? అని ఏపీలో చర్చలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు, జనసేన నేత నాగ బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఇండస్ట్రీ అయినా.. రాజకీయాలైనా ఆయన చేసే ట్విట్స్ ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా నాగబాబు ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్విట్ చేశారు. ఈ ట్విట్ చూసిన వారు నాగబాబు.. చంద్రబాబు ని పరోక్షంగా విమర్శిస్తున్నారా? ఆయనకు చంద్రబాబు అంటీ ఇంత కడుపు మంటా? అన్న సందేహాలు వస్తున్నాయని అంటున్నారు. ‘ వయసు ఎక్కువ, పెద్ద వాడు అని ప్రతి వెధవను గౌరవించనక్కరలేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్ కోట్ ను షేర్ చేశారు. అయితే చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల జనసేన కార్యకర్తలు పెద్ద ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు జనసేనకుల బాధను అర్థం చేసుకొని ఈ పోస్ట్ చేసినట్లు కొంతరు భావిస్తున్నారు.
వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేనకు మొదట 24 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీని నిలబెట్టేందుకు మరో మూడు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జనసేనను 21 సీట్లకే పరిమితం చేశారు. మొదటి నుంచి పవన్ కళ్యాన్ ప్రచార సమయంలో ప్రజలతో చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు చూసి జనసైనికులు భారీ అంచనాలు వేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అభ్యర్థులను ఎంపిక చేయడంపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాన్… టీడీపీ అధినేత చంద్రబాబు ని గుడ్డిగా నమ్ముతున్నారని అభిప్రాపడుతున్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మళా మారాడు అని విమర్శలు వస్తున్నాయి.
జనసేన కార్యకర్తలు తమ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. సీట్ల పంపకం, పార్టీ నేతలకు టిక్కెట్లు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు తన తమ్ముడిని ప్రభావితం చేస్తున్నారని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇది మనసులో పెట్టుకొని నాగబాబు.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పోస్ట్ పై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. నాగబాబు కావాలనే చంద్రబాబు ని టార్గెట్ చేశారని.. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు. మరీ ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.
( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024